Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఫ్లాప్‌ బ్రదర్‌పై భరోసా

ఫ్లాప్‌ బ్రదర్‌పై భరోసా

అల్లరి నరేష్‌కి హిట్టొచ్చి చాలా కాలమవుతోంది. సుడిగాడుతో పెద్ద సుడిగాడు అనిపించుకున్నాక అల్లరి నరేష్‌కి దిష్టి తగిలేసింది. వరుసపెట్టి ఫ్లాపులు రావడంతో తన మార్కెట్‌ కూడా పడిపోయింది. నరేష్‌ సినిమాలకి తొలి రోజు వసూళ్లకి ఢోకా ఉండేది కాదు. అలాంటిది అతను డ్యూయెల్‌ రోల్‌ చేసినా కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 

దీంతో తాను ఎంచుకునే కథల క్వాలిటీ పెరగాలని గుర్తించిన అల్లరి నరేష్‌ అదే పని చేసాడు. ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ’ సినిమా తనని తిరిగి ట్రాక్‌ మీద పెడుతుందని నరేష్‌ అంటున్నాడు. ఇందులో నరేష్‌ చెల్లెలిగా కార్తీక నటించింది. ఈ చిత్రంపై బయ్యర్లు కూడా ఆసక్తి చూపించారు. అందుకే ఈమధ్య నరేష్‌ సినిమాల్లో దేనికీ జరగనట్టుగా దీనికి బిజినెస్‌ జరిగింది. 

నరేష్‌కి ఈ చిత్రంతో బ్రేక్‌ వస్తుందో రాదో అనేది ఇప్పుడే చెప్పడం కష్టం కానీ... తనకి ఈ విజయం చాలా అవసరం. ఇప్పటికే తన మార్కెట్‌ బాగా పడింది కాబట్టి అర్జంటుగా హిట్టుతో దానికి రిపేర్‌ చేసి నిలబెట్టుకోవాలి. లేదంటే చాలా కష్టం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?