Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి

బన్నీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి

ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ అయిన బన్నీ, దసరా నుంచి మరోసారి హల్ చల్ చేయబోతున్నాడు. అవును.. బన్నీ కొత్త సినిమా హంగామా దసరా నుంచే మొదలుకానుంది. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నా పేరు సూర్య అనే సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను దసరాకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

నా పేరు సూర్య సినిమాకు సంబంధించి టైటిల్ లోగో ఇప్పటికే విడుదలైంది. మూవీ ప్రారంభం రోజునే టైటిల్ వచ్చేసింది. ఇక మిగిలింది ఫస్ట్ లుక్ మాత్రమే. ఈ సినిమా కోసం బన్నీ కొత్తగా ముస్తాబయ్యాయి. ఫారిన్ ఫిట్ నెస్ ట్రయిలర్ పర్యవేక్షణలో సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. వీలైతే దసరాకు ఆ నయా లుక్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోలో షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. ఈనెల 24 నుంచి 15 రోజుల పాటు ఊటీలో మరో షెడ్యూల్ ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న నా పేరు సూర్య సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

మూవీలో బన్నీ సరసన అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్-శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటులు అర్జున్, శరత్ కుమార్ ఈ సినిమాలో 2 కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?