Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గోవిందుడి 'సిత్రాలు'?

గోవిందుడి 'సిత్రాలు'?

గోవిందుడు సినిమా చూసిన జనాలు కృష్ణవంశీ ఇంకా ఎక్కడున్నాడు..సవాలక్ష కథలు కలిపి వండడంలోనే వున్నాడు అనకున్నారు. అది కాదు..మెగా జనాలు పరుచూరి బ్రదర్స్ ను తీసుకువచ్చి, కృష్ణవంశీపైన వుంచినపుడే అర్థమయింది ఏకాలం నాటి సినిమావస్తుందోఅని కూడా టాక్ వినిపించింది. 

ఈ సంగతులు అలా వుంచితే, చిత్రంగా కథా కాలం 1980ల నాటిదే కావడం విశేషం. 1980 కాలంలో టాబ్లెట్లు, మొబైళ్లు ఎక్కడున్నాయో? 

ప్రకాష్ రాజ్ నిర్మించిన ఆసుపత్రిపై గాంధీ ఆసుపత్రి 1953 అని వుంటుంది. చరణ్ తండ్రి అప్పడు విదేశాలకు వెళ్లాడన్నమాట. పోనీ అక్కడకు వెళ్లిన పదేళ్లకు పిల్లాడిని కన్నా, 1963లో పుట్టినట్లు. వాడికి పాతికేళ్లు వచ్చి ఇండియా వచ్చాడంటే..1988నాటికి అన్నమాట. మరి ఆ లెక్కన కథాకాలం ఆ నాటిది. అందుకే సినిమా కూడా అలాగే వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?