Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోయిన్లకు రానా మోమాటమ్స్

హీరోయిన్లకు రానా మోమాటమ్స్

దగ్గుబాటి రానా అంటే హీరో మాత్రమే కాదు. రామానాయుడు నెలకొల్పిన భారీ సంస్థ వారసుల్లో ఒకరు. థియేటర్లు, స్టూడియో, ఇంకా ఇతరత్రా వ్యాపారాలు. అలాంటి పర్సన్ ఇప్పుడు హీరోయిన్లను తెగ మోమాట పెట్టేస్తున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రానా తన హీమాన్ పర్సనాలిటీతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుంటాడన్నది ఎప్పడూ వార్తల్లో వినిపించేదే. అదే మోమాటపెట్టడం అనుకుంటే సరికాదు. రానా మోమాటపెడుతున్న వైనం వేరు. 

ఈ మధ్య రానా ఓ కాస్టింగ్ కంపెనీ స్టార్ట్ చేసాడు. నిజానికి సురేష్ స్టూడియో, డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్, ఇతరత్రా, ఇతరత్రా వ్యాపారాలున్న రానా ఇలాంటి కాస్టింగ్ వ్యాపారంలోకి దిగడం అంటే కాస్త ఆశ్చర్యంగానే వుంటుంది. సాధారణంగా టాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్లు ఎవరికి వారు మేనేజర్లను పెట్టుకుని సినిమాల సంగతి చూసుకుంటారు. ఈమధ్యనే కాస్టింగ్ మనుషులు స్టార్ట్ అయ్యారు.

ఇప్పుడు రానా ఏకంగా బాలీవుడ్ లో మాదిరిగా కంపెనీనే స్టార్ట్ చేసేసాడు. ఇక్కడే హీరోయిన్లను రానా మోమాటపెడుతున్నాడట. రకుల్ తదితర టాలీవుడ్ హీరోయిన్లను తన కాస్టింగ్ కంపెనీలతో టై అప్ అవ్వమని అడుగుతున్నట్లు వినికిడి. కానీ దీనికి వారు అంత సుముఖంగా లేరట. దాంతో అవును అని, కాదు అని చెప్పకుండా తప్పించుకుంటున్నారట. 

ఇదిలా వుంటే, సినిమాలంటే ఆసక్తి వున్న అమ్మాయిలను ఎంపిక చేసి, వాళ్లకు చాన్స్ లు ఇప్పించడానికి కూడా ఈ కాస్టింగ్ కంపెనీ కిందా మీదా అవుతోందట. ఈ అమ్మాయిలను వివిధ యూనిట్లకు పరిచయం చేయడంలో రానా తమ్ముడు, దగ్గుబాటి సంస్థ మరో వారసుడు అభిరామ్ తెగ బిజీగా వున్నాడట. అంత పెద్ద సంస్థ వారసుడు, ఇలా కొత్త అమ్మాయిలను నిర్మాణ సంస్థలకు పరిచయం చేసే పని పెట్టుకోవడంపై ఇండస్ట్రీలో, ఇలాంటి బిజినెస్ వాళ్లకు అవసరమా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?