Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కమల్ అభిమానులకు శుభవార్త

కమల్ అభిమానులకు శుభవార్త

లోకనాయకుడు...అద్భుత నటుడు కమల్ హాసన్ అభిమానులకు ఓ శుభవార్త. ఆయన త్వరలో ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. మీలో ఎవరు కోటీశ్వరుడు సెకండ్ సీజన్ ముగింపు ఎపిసోడ్ కు ముఖ్యఅతిధిగా హాజరైన కమల్, ఈ విషయం ప్రకటించారు. 

కమల్ రాగానే నాగ్ తెలుగులో సినిమా చేసి చాన్నాళ్లయింది, మళ్లీ ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నించగా, ఈ వేదిక సరైనది భావించి, ఇక్కడ ప్రకటిస్తున్నానని, విశ్వరూపం 2, పాపనాశనం, ఉత్తమవిలన్ ల పని పూర్తి కాగానే తెలుగు సినిమా చేస్తానని ప్రకటించారు. ఆయన మిగతా వివరాలు అయితే చెప్పలేదు.

గతంలో తేజ డైరక్షన్ లో కమల్ సినిమా ఒకటి వుంటుందని గ్యాసిప్ లు వినిపించాయి. విశ్వనాధ్ సరైన సినిమా ఒకటి మళ్లీ తెలుగులో చేయాలని అనుకుంటున్నారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. మరి కమల్ ఎవరిని ఎంచుకుంటారో..లేదా ఆయనే నేరుగా డైరక్ట్ చేస్తారో..వేచి చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?