Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

రంగు రాళ్లను నమ్ముకున్న హీరోయిన్?!

రంగు రాళ్లను నమ్ముకున్న హీరోయిన్?!

నమ్మని వాళ్లేమో వాటిని రంగు రాళ్లు అనేస్తారు. నమ్మే వాళ్లు మాత్రం మహిమాన్వితమైన రాళ్లుగా భావిస్తారు. రెండో వర్గానికి చెందినదిగా కనిపిస్తోంది కత్రినాకైఫ్. ప్రస్తుతం ఈ భామ ముంబైలోని తన ఫ్లాట్ ను హీలింగ్ క్రిస్టల్స్ తో డెకరేట్ చేయించుకుంటోంది. తన చుట్టూ ఆవరించి ఉన్న నెగిటివ్ ఎనర్జీని సాంతం పారద్రోలి.. పాజిటివ్ ఎనర్జీని సమకూర్చి పెట్టడానికి ఫ్లాట్ ను ఆ క్రిస్టల్స్ తో అలంకరింపజేస్తోందని సమాచారం.

తనను తాను హాఫ్ బ్రిటిషర్ గా ప్రకటించుకుంటుంది కానీ.. వాస్తు శాస్త్రం పై మాత్రం కత్రినాకు బోలెడంత నమ్మకం ఉంది. తన హోమ్ డెకరేషన్ ను వాస్తు ప్రకారమే చేయించుకుంది.  ఇప్పుడు హీలింగ్ క్రిస్టల్స్ తో ఆత్మ తృప్తి పొందుతోంది ఈ భామ.

మరి కొన్ని ఏవైనా ఎదురుదెబ్బలు, అసంతృప్తులు ఉన్నప్పుడు ఈ తరహా విశ్వాసాల మోతాదు పెరుగుతుంది. తన బాయ్ ఫ్రెండ్ రణ్ భీర్ తో వేరే పడ్డాకా, తమ లవ్ నెస్ట్ నుంచి బయటకు వచ్చి తిరిగి పాత ఫ్లాట్ కు చేరిన కత్రినా ఆ ఇంట్లో ఈ మార్పులు అన్నీ చేయిస్తోంది. మరి ఈ విశ్వాసాలకు మూలం ఏమిటో సూఛాయగా అర్థం అవుతోంది కదా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?