Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

సినిమాలకు చైతూ లాంగ్ లీవ్?

సినిమాలకు చైతూ లాంగ్ లీవ్?

అక్టోబర్ లో పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు నాగా చైతన్య. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. ఆగస్టులో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తరువాత నాగా చైతన్య కాస్త గ్యాప్ తీసుకుంటాడని వినవస్తోంది. తరువాతి సినిమా డిసెంబర్ లో కానీ స్టార్ట్ కాదని వినికిడి.

చందు మొండేటి, మైత్రీ మూవీస్ కాంబినేషన్ లో సినిమా ఓకె చేసాడు చైతన్య. అయితే పెళ్లి కారణంగా ఈ సినిమాను డిసెంబర్ నుంచి సెట్ మీదకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాడట. లేదూ అంటే జస్ట్ స్టార్ట్ చేసి, వదిలేసి, డిసెంబర్ లో ఫుల్ గా మొదలెడతారు.

అంటే ఈ ఆగస్టులో సినిమా వచ్చిన తరువాత మళ్లీ చైతన్య సినిమా రావడానికి కనీసం ఏడాది పట్టే అవకాశం వుంది. పెళ్లి వల్ల వచ్చే గ్యాప్ మూడు నెలలు, షూట్ కు మరో ఆరు నెలలు కలిసి తొమ్మిది నెలలు గ్యాప్.

ఆపై విడుదలకు అన్నీ సెట్ అయ్యే సరికి మరో నెలా రెండు నెలలు. అంటే పెళ్లి వల్ల ప్లానింగ్ ఇలా చేయక తప్పడం లేదనుకోవాలి. అంతే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?