Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ కు ఆ టైటిల్ నా?

మహేష్ కు ఆ టైటిల్ నా?

మహేష్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో దిల్ రాజు, అశ్వనీదత్ నిర్మించబోయే సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే దిల్ రాజు, వంశీ పైడిపల్లి, దేవీశ్రీప్రసాద్ అమెరికాలో సిటింగ్ వేసి, ట్యూన్ లు రెడీ చేయడం ప్రారంభించారు. స్క్రిప్ట్ రెడీగా వుంది. ఈ సినిమాకు టైటిల్ కూడా చక్కర్లు కొడుతూంది. హరే రామ హరే కృష్ణ అంటూ. ఇక్కడే మహేష్ ఫ్యాన్స్ కాస్త సెంటిమెంట్ గా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే గతంలో దిల్ రాజే రామ రామ కృష్ణ కృష్ణ అనే సినిమా తీసారు. రామ్ హీరో. సీనియర్ అర్జున్ కీలక పాత్ర ధారి. ఆ సినిమా ఫలితం బాగా రాలేదు. అది మరి అర్జున్ కాంబినేషన్ సెంటిమెంట్ కూడా కావచ్చు. ఈ మధ్య లై సినిమా విషయంలో అదే సెంటిమెంట్ వినిపించింది. కానీ అలాంటి ఫ్లాప్ సినిమా టైటిల్ స్ఫురించేలా, మళ్లీ అదే దిల్ రాజు, హరే రామ హరే కృష్ణ టైటిల్ ఫిక్స్ చేయడం ఏమిటి అన్నది మహేష్ ఫ్యాన్స్ అభ్యంతరంగా తెలుస్తోంది. 

దీంతో మరో ఆప్షనల్ టైటిల్ కూడా వినిపిస్తోంది. కృష్ణ ముకుంద మురారి అని. కానీ ఇది కూడా ఫ్యాన్స్ కు నచ్చడం లేదని వినికిడి. ఎందుకంటే ముకుంద అన్నది మెగా హీరో నటించిన ఏవరేజ్ సినిమా. మురారి సంగతి తెలిసిందే. మరి దిల్ రాజు-వంశీ పైడిపల్లి కలిసి ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?