Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మంచు విష్ణు డైనమైట్‌ అంట

మంచు విష్ణు డైనమైట్‌ అంట

మంచు విష్ణుకి ఈమధ్య కాలంలో చెప్పుకోతగ్గ సక్సెస్‌ లేదు. దేనికైనా రెడీ తర్వాత అతను చేసిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. రామ్‌గోపాల్‌వర్మతో కలిసి చేసిన ప్రయోగాలు కూడా అతనికి సత్ఫలితాలు ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు అరిమ నంబి అనే తమిళ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నాడు. 

దేవా కట్టా డైరెక్ట్‌ చేస్తోన్న ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌. తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రంతో తిరిగి ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు విష్ణు. ఈ చిత్రానికి డైనమైట్‌ అనే టైటిల్‌ ఖరారు చేసారు. విష్ణుకి ‘డి’ అక్షరంతో మొదలయ్యే టైటిల్స్‌ కలిసి వచ్చాయని దీనికి కూడా ఆ సెంటిమెంట్‌ని ఫాలో అయ్యారు. 

ఢీ, దేనికైనా రెడీ తర్వాత తనకిది మరో విజయాన్ని అందిస్తుందని విష్ణు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాడు. వెన్నెల, ప్రస్థానం చిత్రాలతో పేరు తెచ్చుకున్న దేవా కట్టా ఆటోనగర్‌ సూర్యతో ఫ్లాపయ్యాడు. ఈసారి రీమేక్‌ సినిమాతో కట్టా చేస్తోన్న కమర్షియల్‌ ఎటెంప్ట్‌ తనని బిజీగా మారుస్తుందో లేదో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?