Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రభస - మంచు వర్సెస్‌ బెల్లంకొండ

రభస - మంచు వర్సెస్‌ బెల్లంకొండ

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తోన్న ‘రభస’ సినిమా మరోమారు వివాదాల్లోకెక్కింది. గతంలో మంచు లక్ష్మి నిర్మించిన ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ చిత్రం కోసం రూపొందించిన సెట్‌ని ‘రభస’ సినిమాకి ఉపయోగించుకున్నారు. అలా ఉపయోగించుకున్నందుకుగాను 58 లక్షలు అద్దె చెల్లించేందుకు మంచు లక్ష్మితో బెల్లంకొండ సురేష్‌ ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే ‘రభస’ విడుదలకు సిద్ధమైనా, గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తం చెల్లించకపోవడంతో మంచు లక్ష్మి అనుచరులు, బెల్లంకొండ సురేష్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

ఈ వివాదం ముదిరి పాకాన పడ్డంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న పోలీసులు విడివిడిగా ఇద్దరిపైనా కేసులు నమోదు చేయడం గమనార్హం. గతంలో తాను మంచు విష్ణు హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు కొంత అడ్వాన్స్‌ ఇచ్చాననీ, అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయినందున తన అడ్వాన్స్‌ తిరిగి చెల్లించాలని కోరాననీ, ఎలాగూ సెట్‌ వినియోగించుకున్నందున ఆ మొత్తాన్ని తనకు ఇవ్వాల్సిన దాంట్లోంచి మినహాయించుకోమని మంచు లక్ష్మికి చెప్పానంటున్నారు బెల్లంకొండ సురేష్‌.

విష్ణుకి ఇచ్చిన అడ్వాన్స్‌ విషయంలో మంచు లక్ష్మికి ఏంటి సంబంధం.? అన్నది ఇక్కడ లాజిక్‌. మంచు లక్ష్మి, విష్ణు అక్కా తమ్ముడే అయినా.. సినిమాకి సంబంధించి ఎవరి దారి వారిదే. అలాంటప్పుడు బెల్లంకొండ సురేష్‌ వాదన ఎలా నిలుస్తుంది.? ఏమో.. ఈ వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందోగానీ, వివాదం ముదరకుండా వుండేందుకు పలువురు సినీ ప్రముఖులు ప్రయత్నాలు షురూ చేసినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?