Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

మెగా 150కి అన్నీ ఒకసారే

మెగా 150కి అన్నీ ఒకసారే

మెగాస్టార్ 150వ సినిమా అన్నది టీవీ డైలీ సీరియల్ లా తయారైంది. ఎప్పటికి అవుతుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయనే, ఇక 150 వ సినిమా వ్యవహారం గురించి బయటకు ఏవీ పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారని వినికిడి. పైగా రామ్ గోపాల్ వర్మ తరచు టార్గెట్ చేయడం కూడా మెగాస్టార్ ను కలవర పెడుతోందట. 

పూరి జగన్నాధ్ కథను రిజెక్ట్ చేసినందుకే పూరి ఇలా పనిగట్టకుని టార్గెట్ చేస్తున్నాడని అందరు అనుకుంటున్నట్లే, మెగాస్టార్ కూడా ఫీలవుతున్నారట. అందువల్ల ఇక ఈ సినిమా చేస్తున్నామా..ఆ సినిమా చేస్తున్నామా.. రీమేక్ నా, డైరక్టర్ ఎవరు.. ఇలాంటివి అన్నీ ఇక బయటకు రానివ్వరట.. కొబ్బరికాయ ఎప్పుడు కొడితే, అప్పుడే ఒక్కసారి అన్నీ వెల్లడిస్తారట. అంతవరకు అంతా గప్ చుప్ అంట. 

ఈ లోగా తెరవెనుక ఎంత నడపాలో అంతా నడుపుతారన్నమాట. మరి ఇంతకీ ఆ కొబ్బరి కాయ ఎప్పుడు కొడతారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?