Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగ్ క్లూ మీనింగేమిటో?

నాగ్ క్లూ మీనింగేమిటో?

సోషల్ మీడియాలో హీరో నాగార్జున ఏక్టివ్ గా వుంటారు. ట్విట్టర్ ను ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ, అవసరమైనపుడు స్పందిస్తుంటారు. నిన్నటికి నిన్న విక్రమ్ కుమార్-అఖిల్ కాంబినేషన్ స్టిల్ లీక్ అయితే, ఆయనే ఒరిజినల్ స్టిల్ పోస్ట్ చేసి, లైట్ తీస్కోండన్నారు.

ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, ఆ సినిమా టైటిల్ కు క్లూ అంటూ తన ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ హలో గురూ ప్రేమ కోసమేనోయ్ జీవితం పాట బిట్ విడియోను పోస్ట్ చేసారు. అంతే కాదు, మళ్లీ మరో క్లూ కూడా ఇస్తామంటూ హింట్ ఇచ్చారు.

దీంతో టైటిల్ ఏమయి వుంటుందా అన్న డిస్కషన్లు ప్రారంభమయ్యాయి. ఈ మధ్య సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి టైటిళ్ల నాగ్ ఫ్యామిలీ నుంచి వచ్చాయి. అందువల్ల హలో గురూ ప్రేమ కోసమేనోయ్ జీవితం అనే టైటిల్ వస్తుందని కొందరు, అబ్బే, అంత పొడవు టైటిల్ వుండదని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

మరి కొంతమంది ఇంకాస్త ముందుకు వెళ్లి, హలో బ్రదర్ లాంటి హిట్ టైటిల్ మాదిరగా హలో గురూ అన్నది టైటిల్ అయివుంటుందని అంటున్నారు. మన సినిమా అభిమానులు ఇలా హింట్ ఇస్తే అలా పట్టేస్తారని నాగ్ కు మాత్రం తెలియదా? రెండో హింట్ కూడా ఇస్తాను అన్నాడు అంటే మరేదో అయివుండాలి. వేచి చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?