Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

నితిన్-సంపత్ నంది కాంబినేషన్?

నితిన్-సంపత్ నంది కాంబినేషన్?

గౌతమ్ నందా లాంటి స్టయిలిష్ సినిమా ఇటీవలే ఫినిష్ చేసాడు డైరక్టర్ సంపత్ నంది. సినిమా ఆశించిన మేరకు ఆడకపోయినా, మేకింగ్ పరంగా బాగుందన్న పేరు వచ్చింది.

సంపత్ నంది తరువాతి ప్రాజెక్టు హీరో నితిన్ తో వుంటుందన్న వార్తలు వినవస్తున్నాయి. వాస్తవానికి గౌతమ్ నందా కథను ముందుగా నితిన్ కే చెప్పాడు సంపత్ నంది. కానీ అది నితిన్ కు నచ్చలేదు.

ప్రస్తుతం స్వంత బ్యానర్ పై సినిమా చేస్తున్నాడు నితిన్. ఆ సినిమా తరువాత నిర్మాత రాధా మోహన్ కు ఓ సినిమా చేయాల్సి వుంది. రాధామోహన్ అంటే సంపత్ నందితో బెంగాల్ టైగర్ వంటి హిట్ సినిమాను నిర్మించిన నిర్మాత.

అందుకే మళ్లీ సంపత్ నంది-రాధామోహన్ కాంబినేషన్ వార్తల్లోకి వచ్చింది. నితిన్ కు మరో లైన్ తయారుచేసి వుంచారట సంపత్ నంది. అది కనుక నితిన్ కు ఓకె అయితే, నిర్మాతగా వ్యవహరించడానికి రాధామోహన్ రెడీగానే వున్నారు. కొద్ది రోజులు ఆగితే ఏ సంగతి పక్కాగా తెలుస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?