Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ చేస్తున్న సినిమా రీమేక్ అట..?

ఎన్టీఆర్ చేస్తున్న సినిమా రీమేక్ అట..?

తమిళ్ లో హిట్ అయిన వీరమ్ సినిమాకు రీమేక్ గా కాటమరాయుడు వచ్చింది. కానీ ఆ విషయాన్ని మేకర్స్ ఎక్కడా ప్రస్తావించలేదు. చూసీచూడనట్టుగానే ప్రవర్తించారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కూడా అదే కోవలోకి వస్తుందంటున్నారు చాలామంది. గతంలో అజిత్ నటించిన ఓ సినిమానే తారక్ ఇప్పుడు రీమేక్ చేస్తున్నాడని, అయితే ఆ విషయాన్ని మేకర్స్ మాత్రం పైకి చెప్పడం లేదని తెలుస్తోంది.

అజిత్ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో గతంలో వరలారు అనే సినిమా వచ్చింది. ఇందులో అజిత్ ట్రిపుల్ రోల్ చేశాడు. మాఫియా డాన్ గా, ఇద్దరు కొడుకులకు తండ్రిగా కనిపించాడు. డాన్ పాత్రతో పాటు కొడుకుల క్యారెక్టర్లను కూడా అజిత్ పోషించాడు. 2006లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమాకు దగ్గరగా జై లవకుశ మూవీ వస్తోందని టాక్. 

వరలారు సినిమాలో ఓ పాత్రలో అజిత్ క్లాసికల్ డాన్సర్ గా కనిపిస్తాడు. మరో పాత్రలో నెగెటివ్ షేడ్స్ కలిగిన వ్యక్తిగా కూడా నటించాడు. ఎన్టీఆర్ కూడా జై లవకుశలో ఓ పాత్రలో డాన్సర్ గా, విలన్ ఛాయలున్న వ్యక్తిగా కనిపిస్తాడట. ఈ రెండు సినిమాలకు సంబంధించి ఇలాంటి సిమిలారిటీస్ చాలానే చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వీల్ ఛెయిర్ లో కూర్చుని అజిత్ చేసిన పాత్ర లాంటిదే జై లవకుశలో కూడా ఉందంటున్నారు. మరి ఈ పుకార్లపై నిర్మాత కల్యాణ్ రామ్, దర్శకుడు బాబి ఎలా స్పందిస్తారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?