Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఒకే రోజు రెండు భయాలు

ఒకే రోజు రెండు భయాలు

సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హ్యాపీ ఫ్యామిలీ సినిమాలు వస్తాయనుకున్న ఏప్రిల్ 3 వ తేదీన రెండు హర్రర్ సినిమాలు విడుదలవుతున్నాయి. సత్యమూర్తి  వారం రోజులు వెనక్కు వెళ్లడంతో, అవును 2, చిత్రమ్ కాదు నిజమ్ సినిమాలు విడుదలకు రెడీ అయిపోయాయి. 

అవును 2 ను మళ్లీ సరేష్ మూవీస్ సంస్థ నిర్మించింది. రవిబాబే దర్శకుడు. చిత్రమ్ కాదు నిజమ్..గుడ్ సినిమా గ్రూప్ నిర్మించింది. అవును 2 కు ఆల్రెడీ ప్రేక్షకులు వున్నారు. ఎందుకంటే అవును సినిమా వేసిన ముద్ర అలాంటిది. 

చిత్రమ్ కాదు నిజమ్ మాత్రం, ఎక్కడో నిజంగా జరిగిన సంఘటనలో దొరికిన విడియో ఫుటేజ్ తో తయారైన సినిమా అనే పబ్లిసిటీతో ఆసక్తి కలిగిస్తోంది. మరి అది ఎలా వుంటుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?