Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రభాస్ తో అంతే.. ప్రభాస్ తో అంతే

ప్రభాస్ తో అంతే.. ప్రభాస్ తో అంతే

ప్రభాస్ మంచి హోస్ట్. అతని ఆతిధ్యం గురించి ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లలో చాలా విషయాలు వినిపిస్తున్నాయి. అర్థరాత్రి అయినా, తనతో వున్నవారు అడిగినవి తెప్పించి పెట్టడం అన్నది ప్రభాస్ స్టయిల్.

ఇప్పుడు ప్రభాస్ ఆతిధ్యం ఎలా వుంటుందో తొలిసారి రుచి చూసింది బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. అందుకే ఆ వైనాన్ని సోషల్ నెట్ వర్క్ లో షేర్ చేసుకుని, మురిసిపోయింది. ప్రభాస్ ఎవరు? గోదావరి జిల్లా వాడు. ఇక మరి అక్కడ భోజనంలోకి చేసుకునే రకాల లెక్క చెప్పడానికి  ఏముంది.

వెజ్జూ, నాన్ వెజ్జూ అంటూ బోలెడు రకాలు కుమ్మేసాడట మధ్యాహ్నం లంచ్ లోకి. వీటిలో చికెన్ పులుసు, పీతల ఇగురు, ఎగ్ కర్రీ, గోంగూర మటన్ లాంటి స్పైసీ అయిటమ్ లు, ములక్కాడ, తోటకూర, రోటిపచ్చడి వంటి వెజ్ అయిటమ్ లు వున్నాయట. వీటిని ఫోటోలు తీసి, షేర్ చేసి, తన తొలి తెలుగు సినిమా షూటింగ్ అనుభవాన్ని జనాలతో పంచుకుంది శ్రద్ధా కపూర్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?