Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజమౌళి ఫాదర్ మరో ఫెయిల్యూర్

రాజమౌళి ఫాదర్ మరో ఫెయిల్యూర్

రామాయణం, భారతంలోని ఘట్టాలు తీసుకునో, లేదా వేరే నవలలు, సినిమాల నుంచి గ్రహించో, ఇంకా కాదంటే పాత సినిమాలు, హాలీవుడ్ సినిమాలు అటు ఇటు తిప్పేసో కథకుడైపోవచ్చు. కానీ డైరక్షన్ అంత వీజీ కాదు.

దర్శకుడు రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ కు డైరక్షన్ పై మక్కువ ఎక్కువ. పాపం, రాజన్న సినిమా ట్రయ్ చేసారు. డిజాస్టర్. మళ్లీ ఇన్నాళ్లకు శ్రీవల్లి అనే సినిమా ట్రయ్ చేసారు. మరో పరమ డిజాస్టర్. షో కి మూడు వేలు, రెండు వేలు కలెక్షన్. దాంతో పాపం, ఆయనే ఒప్పుకున్నారు.

నిర్మాతలు పెట్టుబడి పెట్టినా, నటులు, సాంకేతిక నిపుణులు ఎవరి పని వారు బాగానే చేసినా, డైరక్షన్ సరిగ్గా చేయలేదని. నిజానికి ఆ మాటకు వస్తే, ఆయన కథలు రాజమౌళి దగ్గర తప్పు ఎక్కడ నడిచాయి. ఒక్క భజరంగ్ బాయీజాన్ తప్ప. అది కూడా మన పసివాడి ప్రాణం టైపు.

ఆ మధ్య కన్నడ రాజకీయ ప్రముఖుడు కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ కు భారీ అద్వితీయ అమోఘమైన కథ అని ఇస్తే, అది కాస్తా డిజాస్టర్ అయి కూర్చుంది. మరి ఇకనైనా డైరక్షన్ కోరిక వదలుకుంటారో? మరే నిర్మాత అయినా మళ్లీ దొరుకుతారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?