Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రెండు సినిమాలు-ఇద్దరు విలన్లు

రెండు సినిమాలు-ఇద్దరు విలన్లు

ఈ దసరాకు రెండు భారీ సినిమాలు విడుదలవుతున్నాయి. మహేష్ బాబు స్పైడర్, ఎన్టీఆర్ జై లవకుశ పోటాపోటీగా వస్తున్నాయి. ఈ సంగతులు తెలిసినవే. చిత్రమేమిటంటే, ఈ రెండు సినిమాల్లో విలన్ పాత్రలు బలమైనవి కావడం. జైలవకుశ సినిమాలో హీరో ఎన్టీఆర్ నే విలన్ ఛాయలున్న జై పాత్రను కూడా పోషిస్తున్నారు. వాస్తవానికి పాత్ర పేరు జై కానీ, పాత్ర అయితే అచ్చంగా రావణుడి ఛాయల్లోంచి పుట్టుకు వచ్చిందే. అంత బలమైన విలనిజం వున్న పాత్ర అన్నమాట.

ఇక స్పైడర్ సినిమాలో విలన్ కూడా తక్కువ తినలేదు. దర్శకుడు ఎస్ జె సూర్య పోషిస్తున్నారు. శివపుత్రుడు సినిమాలో విక్రమ్ పాత్ర పాజిటివ్ కాకుండా నెగిటివ్ గా వుంటే ఎంత భీకరంగా వుంటుందో, ఈ పాత్ర అలా వుంటుందట. ఎస్ జె సూర్య పోషించిన ఈ పాత్ర కూడా శ్మశానంలో పుట్టి, శ్మశానంలో పెరుగుతుందని వినికిడి. శ్మశానంలో ఏడుపులు వినివిని రాటు దేలిపోయిన గుండెతో జనాలను బాధపెట్టే పాత్ర అన్నమాట.

ఆ విధంగా రెండు సినిమాల్లో హీరో పాత్రలతో పాటు విలన్ పాత్రలు కూడా చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. ఎటొచ్చీ జైలవకుశ లో విలన్ కూడా గ్లామరస్ గా వుండి, అయిటమ్ సాంగ్ లో రావణతాండవం చేసాడు. కానీ స్పైడర్ లో విలన్ మాత్రం ఎంటర్ టైన్ మెంట్ జోలికి పోకుండా, తన చర్యలతో భయపెట్టడమే పనిగా పెట్టుకుంటాడు. అన్నట్లు జై లవకుశలో విలన్ పాత్రకు ఎన్టీఆర్ తన స్వరంతో ప్రాణం పోస్తే, స్పైడర్ లో విలన్ పాత్రకు రవిశంకర్ (అరుంధతి ఫేమ్) డబ్బింగ్ చెప్పి, అదరగొట్టేసాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?