Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాయిధరమ్ తేజ 'తిక్క'

సాయిధరమ్ తేజ 'తిక్క'

సాయిధరమ్ తేజతో మరో సినిమా రేపు ప్రారంభమవుతోంది. టైటిల్ రేపు ప్రకటిస్తారు. తిక్క అని డిసైడ్ చేసినట్లు తెలిసింది. ఈ సినిమాలో చాలా విశేషాలు వుండేలాగే వున్నాయి. ఓం త్రీడీ తరువాత సునీల్ రెడ్డి రూపొందించే ఈ సినిమాలో అయిదుగురు అమ్మాయిలు నటించడం విశేషం. 

ఒకరు హీరోయిన్ కాగా, మరో నలుగురు హీరోయిన్ తో దాదాపుగా నిల్చునే పాత్రలు. వీటిలో ఒకదాన్ని ఐటమ్ డ్యాన్సర్ గా ఓ ఊపు ఊపేసిన ముమైత్ ఖాన్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది.మరో నలుగురిలో ఒకరు మనాలి చోప్రా . అల్లరి కుర్రాడి టైపు క్యారెక్టర్ సాయి ధరమ్ ది అని వినికిడి. మొత్తం మీద ఓ వెరైటీ సినిమా ఈ కథను సునీల్ తయారు చేసాడట. 

ఇంతమంది అమ్మాయిలు, సాయిధరమ్ అల్లరి అంటే...తిక్క కాకుంటే మరేమిటి. మామయ్య పవన్ టైటిల్ ను కొట్టేసాడన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?