Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిన్న హీరోలకు శాటిలైట్ కష్టాలు

చిన్న హీరోలకు శాటిలైట్ కష్టాలు

సినిమాలు ఫ్లాప్ అయినా ఒక్కోసారి శాటిలైట్ రైట్స్ నిర్మాతల్ని ఆదుకుంటాయి. మొన్నటికి మొన్న నక్షత్రం, లై సినిమాల విషయంలో ఇదే జరిగింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ శాటిలైట్ రైట్స్ విషయంలో మాత్రం రెండూ లాభపడ్డాయి. కానీ సునీల్, సందీప్ కిషన్ కు తమ నెక్ట్స్ సినిమాల విషయంలో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది.

సునీల్ నటించిన ఉంగరాల రాంబాబు సినిమా డిజాస్టర్. ఇప్పుడీ సినిమాను తీసుకొనేందుకు టీవీ ఛానెల్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎంతోకొంతకు వదిలించుకుందామనుకున్నా ఏ ఒక్క ఛానెల్ సిద్ధంగా లేదు. కేవలం ఉంగరాలు రాంబాబు మాత్రమే కాదు.. రిలీజ్ కు రెడీ అయిన 2-కంట్రీస్ ది కూడా ఇదే పరిస్థితి.

అటు సందీప్ కిషన్ కు కూడా నక్షత్రం దెబ్బ బాగానే తగిలింది. ఆ సినిమా ఎఫెక్ట్ తో అతడికి చెందిన చాలా సినిమాలు శాటిలైట్ కు నోచుకోవడం లేదు. ప్రాజెక్టు జెడ్, కేరాఫ్ సూర్య, నగరం.. ఇలా సందీప్ నటించిన 3-4 సినిమాల శాటిలైట్ రైట్స్ కొనేందుకు ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

ఈ లిస్ట్ లో సునీల్, సందీప్ మాత్రమే కాదు.. నారా రోహిత్, ఆది, సుధీర్ బాబు, మంచు మనోజ్, గోపీచంద్ లాంటి హీరోలు చాలామంది ఉన్నారు. నారా రోహిత్ నటించిన సావిత్రి, అప్పట్లో ఒకడుండేవాడు, శంకర, తుంటరి సినిమాలు ఇంకా శాటిలైట్ కు నోచుకోలేదు. తాజాగా విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన కథలో రాజకుమారి సినిమా కూడా ఈ లిస్ట్ లోకి చేరింది.

అటు గోపీచంద్ నటించిన ఓ సినిమా ఆర్థిక ఇబ్బందుల వల్ల శాటిలైట్ కు దూరం కాగా.. ఆది నటించిన 2-3 సినిమాలు, మంచు మనోజ్ నటించిన 2 సినిమాలు శాటిలైట్ రైట్స్ అమ్ముడుకాక ఎదురుచూస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?