Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శంకర్ సంగతి సరే,,గౌతమ్ సంగతేమిటి?

శంకర్ సంగతి సరే,,గౌతమ్ సంగతేమిటి?

శంకర్ సినిమా ఐ విడుదల తెలుగునాట డౌట్ లో పడింది. అందరూ ఐ మీదే దృష్టి పెట్టారు కానీ, తమిళనాట మరో మంచి కాంబినేషన్ కూడా సంక్రాంతికి విడుదలవుతోంది. అజిత్-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లోని ‘ఎన్నయ్ ఆరిందాళ్’ సినిమా అది. 

దీన్ని తెలుగులో ఎంతవాడు గానీ అని డబ్ చేసి వుంచారు. అజిత్ సరసన అనుష్క, త్రిష నటించడంతో ఈ ప్రాజెక్ట్ కు తెలుగునాట కూడా మాంచి ఓపెనింగ్స్ వుంటాయి. అయితే ఇప్పటికే చాంబర్ లో సంక్రాంతికి డబ్బింగ్ సినిమాల విడుదలపై గడబిడ జరుగుతోంది. 

శంకర్ ఐ సినిమాకే సమస్యగా వుంది. ముఫై రెండు కోట్ల హక్కుల సినిమా అది. సంక్రాంతికి తమిళ వెర్షన్ తో సహ రాకపోతే, సమస్యగా మారుతుంది. మరి ఆ సినిమాకే అడ్డంకులు వస్తుంటే, ఇక అజిత్ సినిమా సంగతేమిటో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?