Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శిష్యులకు ఆదేశాలు జారీచేసిన రాజమౌళి

శిష్యులకు ఆదేశాలు జారీచేసిన రాజమౌళి

బాహుబలి-2 తర్వాత నెక్ట్స్ సినిమా ఏంటనే విషయంపై రాజమౌళి క్లారిటీ ఇవ్వలేదు. సినిమా విడుదలైన తర్వాత 2-3 నెలలపాటు కంప్లీట్ గా రెస్ట్ తీసుకుంటానని, అసలు సినిమా ఆలోచనే లేకుండా ఎంజాయ్ చేస్తానని జక్కన్న చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తన నెక్ట్స్ సినిమా ఏంటనే విషయంపై రాజమౌళి ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకపోయినప్పటికీ... తన అనుచర వర్గానికి మాత్రం ఈ విషయంపై చిన్నసైజు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

నెక్ట్స్ సినిమా ఎలా ఉంటే బాగుంటుంది, బాహుబలి తర్వాత ఎలాంటి స్టోరీలైన్ పిక్ చేసుకుంటే మంచిదనే అంశాలపై రీసెర్చ్ చేయాల్సిందిగా తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డైరక్టర్లకు రాజమౌళి సూచించాడట. బాహుబలి-2 రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని, ఆ తర్వాత అందరం కూర్చొని చర్చించుకుందామని చెప్పాడట. ఇదే సందర్భంలో హీరో క్యారెక్టరైజేషన్ కు సంబంధించి కూడా అసిస్టెంట్ డైరక్టర్లకు కొన్ని హింట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

రాజమౌళికి క్లోజ్ గా ఉండే సర్కిల్ చెబుతున్న వివరాల ప్రకారం... ఇప్పటికే తమ మైండ్ లో ఓ హీరోను ఫిక్స్ అయ్యాడట జక్కన్న. బాహుబలి-2 రిలీజ్ అవ్వకముందే ఆ వివరాల్ని బయటపెడితే బాగుండదు కాబట్టి చెప్పలేదట. పైగా కథ కూడా ఫైనలైజ్ అయ్యాక ఒకేసారి ఎనౌన్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నాడట. సో... నెక్ట్స్ సినిమాపై రాజమౌళి వర్క్ చేయకపోయినా, అతడి శిష్య బృందానికి మాత్రం చేతినిండా పని కల్పించాడన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?