Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సునీల్ వెనుక కుట్ర జరుగుతోందా?

సునీల్ వెనుక కుట్ర జరుగుతోందా?

టాలీవుడ్ లో అతి కోద్ది మందికి మాత్రమే ఈ విషయమై సందేహాలు వున్నాయి. ఈ మేరకు కొన్ని సందేహాలు, అనుమానించదగ్గ అంశాలు కనిపిస్తున్నాయని ఆ కొద్ది మంది భావిస్తున్నారు. హీరో సునీల్ పై ఎవరో ఓ నిర్మాత కక్ష కట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జక్కన్న సినిమా ఓ మాదిరి అబౌవ్ ఏవరేజ్ సినిమా అనిపించుకున్నా కూడా శాటిలైట్ కాలేదు. సాధారణంగా కామెడీ సినిమాలకు, ఫ్యామిలీ సినిమాలకు శాటిలైట్ సమస్య పెద్దగా రాదు. పైగా రేటు కోసం పట్టుపట్టి కూర్చుంటే ఏమోై అనుకోవచ్చు. కానీ అదీ లేదు. 

అయితే నిర్మాత ఏదో కిందా మీదా పడి ఓ చానెల్ దగ్గర మొత్తానికి ఓకె అనిపించుకున్నారట. ఫైల్ అంతా మూవ్ అయింది. తెల్లవారి ఓకె అయిపోతుంది, చెక్ చేతికి వస్తుంది అనుకున్నటైమ్ లో, ఏం జరిగిందో సారీ చెప్పేసారట. దీని వెనుక ఓ నిర్మాత వున్నారని, సునీల్ సినిమాను కొనవద్దని ఆ చానెల్ వారిని ఇన్ ఫ్లూయెన్స్ చేసారని టాక్ వినిపిస్తోంది. అదే విధంగా కృష్ణాష్టమి, జక్కన్న, వీడు గోల్డ్ సినిమాల ప్రచారం సందర్భంగా కూడా కొన్ని చానెళ్లకు, ఎఫ్ఎమ్ లకు కూడా ఓ నిర్మాత ఫోన్ లు చేసి, వాటికి మరీ ఎక్కువ ప్రచారం ఇవ్వవద్దని కోరినట్లు తెలుస్తోంది. 

ఇది వాస్తవమే అని ఆయా చానెళ్ల జనాలు చెబుతున్నారట కానీ, ఎవరా నిర్మాత అన్నది మాత్రం చెప్పడం లేదట. సునీల్ మీద ఇంతగా పగబట్టగల అవసరం ఏ నిర్మాతకు వుంటుంది? పైగా చానెళ్లను, మీడియాను కాస్తయినా ప్రభావితం చేయగల నిర్మాత ఎవరై వుంటారు అన్నది అనుమానం. ఇవన్నీ గాలి వార్తలేమో అని అనుకుంటే, కాదని సునీల్ సన్నిహితులు అంటున్నారు. పైగా కొన్ని నెలల క్రితం ఓ సినిమా పెద్దాయిన కూడా సునీల్ కు చెప్పారట..నీ వెనుక సమ్ థింగ్ జరుగుతోంది చూసుకో అని..ఇప్పుడు అది ఇది కలుపుకుంటే నిజమే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కానీ తెలియంది ఆ నిర్మాత ఎవరన్నదే..ఆ అవసరం ఎవరికి వుందన్నదే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?