Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సూర్య తో సినిమాపై హారిక హాసిని వెనుకంజ?

సూర్య తో సినిమాపై హారిక హాసిని వెనుకంజ?

సౌత్ సూపర్ స్టార్ సూర్యతో సినిమా చేస్తుంది హారిక హాసిని సంస్థ అన్నది నిన్నటి వరకు కచ్చితమైన వార్త. కానీ ఇప్పుడు కాస్త డౌట్ లో పడింది. సూర్యతో ఇప్పుడు సినిమా చేయడమా, ఆగడమా అని ఆ సంస్థ అధినేత చినబాబు ఆలోచిస్తున్నారని వినికిడి. దీనికి చాలా కారణాలు వున్నాయని వినికిడి.  

తొలి కారణం దర్శకుడు త్రివిక్రమ్... సమంత, నితిన్ లాంటి అనుకూలమైన స్టార్స్ ను పెట్టి, సులువుగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్లు దొరికే పరిస్థితి వుంటేనే, ఈ చిన్న సినిమాను ఏడాది పాటు చెక్కారు. మరి అలాంటిది తమిళ, తెలుగు కాంబినేషన్ లో తీయాల్సిన సినిమా. మరి ఎంతకాలం పడుతుంది? 

ఇక రెండో కారణం బడ్జెట్. నితిన్ తో సినిమా తీస్తేనే నలభై కోట్లకు పైగా ఖర్చు చేయించారు త్రివిక్రమ్. మరి సూర్య సినిమా అంటే వంద కోట్లే. ఇక్కడే అసలు సమస్య వుంది. 24 మాదిరిగా సూపర్ ఫాజిటివ్ టాక్ వచ్చిన సినిమానే వంద కోట్ల గ్రాస్ లాగడానికి కిందామీదా పడంది. 

మరి సూర్య మార్కెట్ అలా వుంటే, రెండు లాంగ్వేజ్ ల్లో వందకోట్లు ఖర్చుచేసి సినిమా తీయడం అవసరమా? అదీ కాక, త్రివిక్రమ్ స్టయిల్ క్లాస్ కామెడీ తమిళ జనాలకు నచ్చుతుందా అన్నది అనుమానం. ఇవన్నీ కలిసి, హారిక హాసిని సంస్థను సూర్య సినిమాకు దూరంగా జరపుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?