Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తమిళ సినిమాలో సంపూ

తమిళ సినిమాలో సంపూ

హృదయకాలేయం..బర్నింగ్ స్టార్..అంటూ సడెన్ గా దూసుకొచ్చిన సంపూర్ణేష్ బాబు మెల్లిగా సెటిల్ అవతున్నట్లే కనిపిస్తోంది. తొలిసారి కాస్త పెద్ద క్యారెక్టర్ అల్లరి నరేష్ బందిపోటులో చేస్తున్నాడు. క్లాస్ డైరక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ  సంపూ చేత కాస్త మంచి క్యారెక్టరే చేయించి వుంటాడనడంలో సందేహం లేదు. పైగా పోస్టర్లపై కూడా ఎక్కడ పడితే అక్కడ హీరోతో సమానంగా దర్శనమిస్తున్నాడు. 

ఇప్పుడు దీనికి తోడు తమిళనాట కూడా మనవాడికి చాన్స్ దొరికిందట. విక్రమ్ సినిమా ఒకటి ఫైనలైజ్ అయింది ఐ తరువాత. ఇప్పుడు దాంట్లోకి సంపూని తీసుకున్నారట. మురుగదాస్ నిర్మాత, విజయ్ మిల్టన్ దర్శకత్వం. అంటే ఓ  రేంజ్ సినిమానే. దీంతో మనవాడు అక్కడ కూడా పాపులర్ అయిపోతాడేమో?​

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?