Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తమిళ రీమేక్ లో అల్లరి నరేష్

తమిళ రీమేక్ లో అల్లరి నరేష్

ఇటీవల సరైన హిట్ లు లేక, కాస్త డల్ అయిన హీరో అల్లరి నరేష్ మళ్లీ పుంజుకుంటున్నాడు. మూడు ప్రాజెక్టులు వన్ బై వన్ పైప్ లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే మేడమీద అబ్బాయి అనే ఫ్యామలీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. ఆ ప్రాజెక్టు దాదాపు పూర్తి కావచ్చింది. 

ఈలోగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో గీతాంజలి, శంకరాభరణం లాంటి సినిమాలు అందించిన ఎమ్ వివి బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమా రీమేక్ హక్కులు తీసుకున్నారు.

ఇదిలా వుంటే ఈ రెండు సినిమాల తరువాత కామెడీ ఎంటర్ టైనర్ లు తీయడంలో కాస్త గట్టివాడైన ఓ డైరక్టర్ కాంబినేషన్ లో సినిమా చేయడానికి అల్లరి నరేష్ స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?