Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తిక్కను వెనక్కు తోయక తప్పదా?

తిక్కను వెనక్కు తోయక తప్పదా?

గీతా ఆర్ట్స్ లేదా అరవింద్ తో ఏదో విధంగా లింక్ అయిన సినిమా వచ్చింది అంటే, ఆ తరువాత మొదలవుతుంది అసలు కథ. షెడ్యూలు అయిన సినిమాలు వాటంతట అవి పక్కకు తప్పుకుంటూ వుంటాయి.  కొన్ని వచ్చినా అంత సీన్ వుండకుండా పోతాయి. మరి ఇదంతా స్ట్రాటజీనో, అదృష్టమో తెలియదు. ఇప్పుడు అల్లు అరవింద్ పనితనానికి, అదృష్టానికి మరో పరీక్ష ఎదురయింది. 

రెండో కొడుకు అల్లు శిరీష్ తో చాలా కాలంగా చెక్కుతూ వస్తున్న శ్రీరస్తు శుభమస్తు  విడుదల డేట్ దగ్గరకు వచ్చింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది. చాలా కేర్ తీసుకోవడం, రీషూట్ లు చేయడం వంటి వాటితో లేటయింది. ఈ సినిమా 5న విడుదలవుతోంది.అదే రోజు రెండు సినిమాలు పోటీగా వుంటాయి అనుకుంటే, అప్పుడే చుట్టాలబ్బాయి బరిలోంచి తప్పుకున్నట్లు వార్తలు అందుతున్నాయి. మనమంతా సినిమా క్లాస్.అందువల్ల శ్రీరస్తుకు సమస్య లేదు. 

కానీ చుట్టాలబ్బాయి యంగ్ హీరో, పైగా ఎంటర్ టైన్ మెంట్ జోనర్. అది గట్టిపోటీ అయ్యేదే. కానీ  వెనక్కు వెళ్లిపోయింది. అక్కడికి వారం దూరంలో మారుతి బాబు బంగారం వుంది. పెద్ద బ్యానర్, పెద్ద హీరో. కాబట్టి అది అటు ఇటు జరగడం కుదరదు. కానీ 13న తిక్క సినిమా అని ఇంతకు ముందు అన్నారు. అయితే అదీ మెగా హీరో సినిమానే. పైగా మాస్ సినిమా. అంతే కాదు కాస్త క్రౌడ్ పుల్లింగ్ కు అవకాశం వున్న సాయి ధరమ్ తేజ సినిమా. 

మరి శ్రీరస్తు విడుదలై వారం కాకుండానే వెంకీ లాంటి హీరో సినిమా, సాయి ధరమ్ లాంటి మెగా కాంపౌండ్ హీరో సినిమా వస్తే ఇంతో అంతో సమస్యేగా. అందుకే తిక్క ను ఏదో విధంగా వెనక్కు పంపిస్తారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ 5 నుంచి 13కి వస్తోంది చుట్టాలబ్బాయి. దాన్ని అక్కడ వుంచుతారో..మరికాస్త వెనక్కు నెడతారో?  ఇండస్ట్రీలో సత్తా వుంటే ఏదైనా సాధ్యమే. కానీ సినిమాలో కూడా సత్తా వుండాలి. అదే అసలు కీలకం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?