Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

రికార్డులు బద్దలవుతాయనేది అందరూ ఊహించినదే. కానీ బాహుబలి అందరి ఊహలని మించిపోయి తొలి వారంలోనే చాలా రికార్డులని తిరగరాసింది. హయ్యస్ట్‌ ఇండియన్‌ సినిమా గ్రాసర్‌గా, బిగ్గెస్ట్‌ ఎవర్‌ హిట్‌ ఇన్‌ యుఎస్‌గా అవతరించడానికి బాహుబలికి వారం పట్టలేదు. 

ఆరు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లకి పైగా షేర్‌ సాధించి అందరినీ అబ్బురపరచింది. కర్నాటక, కేరళ, తమిళనాడు... ఇలా ఎక్కడ చూసినా బాహుబలి ముద్ర బలంగా పడింది. హిందీ వెర్షన్‌ అక్కడి ఒరిజినల్‌ చిత్రాల రికార్డులని బీట్‌ చేయడం అన్నిటికంటే గొప్ప విషయం. 

మొదటి భాగం కంటే ఇది బాగా ఆడుతుందని అనుకున్నారే కానీ మరీ ఇలా వేలం వెర్రిగా డబ్బింగ్‌ సినిమా కోసం ఎగబడతారని తలలు పండిన ట్రేడ్‌ పండితులు కూడా ఊహించలేదు. తొలి రోజు రికార్డు, తొలి వారాంతం రికార్డు, తొలి వారం రికార్డు ఇలా ఏదీ మిగల్చకుండా బాలీవుడ్‌ రికార్డులని తుడిచి పెట్టేసిన బాహుబలి కేవలం హిందీ వర్షన్‌ వసూళ్లతోనే 'దంగల్‌' పేరిట వున్న రికార్డుని బ్రేక్‌ చేసేలాగుంది. ఈ వీకెండ్‌తో వెయ్యి కోట్ల గ్రాస్‌ని కూడా దాటబోతున్న ఈ చిత్రం కేవలం ఇండియాలోనే వెయ్యి కోట్ల గ్రాస్‌ వసూలు చేయడం ఖాయమనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?