Advertisement

Advertisement


Home > Sports - Cricket

అమ్మ.. అనుష్క.. వెరీ వెరీ స్పెషల్‌

అమ్మ.. అనుష్క.. వెరీ వెరీ స్పెషల్‌

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన తల్లిని, అలాగే తన ప్రియురాలినీ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు. ట్విట్టర్‌ ద్వారా తన జీవితంలో ఈ ఇద్దరూ చాలా ముఖ్యమైన మహిళలని చెబుతూ ఆ ఇద్దరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. క్లిష్ట పరిస్థితుల నుంచి కుటుంబాన్ని ముందుకు నడిపించిన ఘనత తన తల్లికే చెందుతుందన్నాడు కోహ్లీ. జీవితంలో అనుష్క ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసిందనీ, కఠిన సందర్భాల్ని ధైర్యంగా ఎదుర్కొందని ప్రియురాలు అనుష్క గురించి విరాట్‌ కోహ్లీ చెప్పుకొచ్చాడు. 

అనుష్క - విరాట్‌ కోహ్లీ మధ్య చాలాకాలంగా 'ప్రేమాయణం' నడుస్తోంది. అయితే, 'పెళ్ళెప్పుడు.?' అన్న ప్రశ్నకి మాత్రం ఇద్దరిలో ఎవరూ సరైన సమాధానం చెప్పడంలేదు. మనసులో ప్రేమ వుంటే, ప్రతిరోజూ ప్రేమికులకి ప్రేమికుల దినోత్సవమేనని ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా కోహ్లీ అనుష్కతో కలిసి వున్న ఫొటోని పోస్ట్ చేస్తూ కామెంట్ చేసిన విషయం విదితమే.

మొత్తమ్మీద, విరాట్‌ కోహ్లీ.. తన జీవితంలో ప్రియురాలు అనుష్కకి చాలా ప్రత్యేకమైన స్థానం కల్పించాడన్నమాట. తన మీద కోహ్లీ కురిపించిన అభిమానానికి ముగ్ధురాలైపోతుంది అనుష్క. విరాట్ తన తల్లి తర్వాత తనకు అంతటి స్థానం కల్పించడం చాలా ఆనందంగా వుందని అంటోందామె. ‘విరాట్‌కి థ్యాంక్స్‌ చెప్పడమొక్కటే సరిపోదు.. మహిళల్ని ఎంతలా ఆయన గౌరవిస్తాడో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి‘ అని అనుష్క శర్మ అంటోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?