Advertisement

Advertisement


Home > Movies - Movie News

నితిన్ పెళ్లి పనులు ప్రారంభం

నితిన్ పెళ్లి పనులు ప్రారంభం

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని నితిన్ ఈమధ్య అధికారికంగా ప్రకటించాడు. అమ్మాయి డీటెయిల్స్ కూడా బయటపెట్టాడు. 8 ఏళ్లుగా షాలినీ అనే అమ్మాయి తనకు పరిచయమని, ఐదేళ్లుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని స్పష్టంచేశాడు. ఇప్పుడా అమ్మాయితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు ఈహీరో. ఈరోజు నితిన్ పెళ్లి పనులు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. వీటికి సంబంధించిన ఫొటోలు కూడా రిలీజయ్యాయి.

హైదరాబాద్ కు చెందిన షాలిని, యూకేలో బిజినెస్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ చేసింది. ఆమెకు సంబంధించిన ఫొటో ఒకటి నిన్ననే నెట్ లో ప్రత్యక్షమైంది. ఈరోజు పసుపు-కుంకుమ ఫంక్షన్ తో ఆమె ఫొటోలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి.

ఏప్రిల్ 15న నితిన్-షాలిని నిశ్చితార్థం ఉంటుంది. ఆ మరుసటి రోజునే దుబాయ్ లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. పెళ్లి తర్వాత ఏప్రిల్ చివరి వారంలో టాలీవుడ్, రాజకీయ ప్రముఖులకు పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాడు నితిన్.

36 ఏళ్ల నితిన్ కెరీర్ లో ఎన్నో గాసిప్స్ వినిపించాయి. చాలామంది హీరోయిన్ల పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. చివరికి పెళ్లి విషయంలో కూడా అమ్మాయి వివరాలపై చాలా ఊహాగానాలు చెలరేగాయి. ఎట్టకేలకు ఇవాళ్టి ఫంక్షన్ తో వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేశాడు ఈ హీరో.

అలాంటి అబ్బాయి కావాలి..

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?