Advertisement

Advertisement


Home > Politics - Andhra

మ‌రో కేసులో బాబు ఏ1, లోకేశ్ ఏ2

మ‌రో కేసులో బాబు ఏ1, లోకేశ్ ఏ2

స్కిల్ స్కామ్ కేసు త‌ర్వాత చంద్ర‌బాబుపై మ‌రో కేసు. ఈ ద‌ఫా కూడా ఆయ‌న‌పై ఏపీ సీఐడీ కేసు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న కుమారుడిపై కేసు న‌మోదైంది. ల్యాండ్ టైటిలింగ్ చ‌ట్టంపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారంటూ ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ల్యాండ్ టైటిల్ చ‌ట్టంపై టీడీపీ ఫేక్ ప్ర‌చారం చేస్తోంద‌ని, చ‌ర్య‌లు తీసుకోవాల‌నే వైసీపీ ఫిర్యాదుపై ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్‌గా స్పందించింది.

వెంట‌నే సీఐడీ ద‌ర్యాప్తున‌కు ఈసీ ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌ల‌తో పాటు మ‌రో ప‌ది మందిపై కేసు న‌మోదైంది. ఈ కేసులో చంద్ర‌బాబు ఏ1, లోకేశ్ ఏ2 కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేసు విచార‌ణ నిమిత్తం ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి వెళ్లిన‌ట్టు తెలిసింది.  

టీడీపీ కేంద్ర కార్యాల‌యం నుంచే ల్యాండ్ టైటిలింగ్ చ‌ట్టంపై దుష్ప్ర‌చారం చేశార‌ని ఏపీ సీఐడీ నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది. అందుకే టీడీపీని సీఐడీ టార్గెట్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు కేసు న‌మోదు కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

వైసీపీకి అనుకూలంగా ఎన్నిక‌ల సంఘం న‌డుచుకుంటోంద‌ని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఫిర్యాదు చేయ‌గానే త‌మ నేత‌ల‌పై కేసు న‌మోదు చేయ‌డం ఏంట‌ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?