Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

నితిన్ కు డైరక్టర్లు కావలెను

నితిన్ కు డైరక్టర్లు కావలెను

అ..ఆ సినిమా పూర్తయిపోయి నెలలు దాటుతోంది. విడుదల అయిపోయి కూడా పరిస్థితి అలాగే వుంది. కానీ ఆ సినిమా హీరో నితిన్ మరో సినిమా ఏదీ ఇంతవరకు సెట్ మీదకు వెళ్లలేదు. నిర్మాతలు లేరా అంటే ఆ సమస్య లేదు. ఓన్ బ్యానర్ వుంది. పైగా బెంగాల్ టైగర్ నిర్మాత రాధామోహన్ రెడీగా వున్నారు అగ్రిమెంట్ చేసుకుని. మరి ఏమిటి సమస్య అంటే, డైరక్టర్ లేరు. 

ముందుకు వచ్చిన డైరక్టర్లు నచ్చడం లేదు. సంపత్ నంది అనుకున్నారు. కుదరలేదు..నందినీ రెడ్డి నేనున్నా అన్నా సెట్ కాలేదు. సరైన యూత్ ఫుల్ మూవీ తీయగలిగిన డైరక్టర్ ల కోసం వేటాడుతున్నాడు. కానీ దొరకడం లేదు. గతంలో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చాడు. ఒకటి సెట్ అయింది ఒకటి సెట్ కాలేదు. అందుకే ఈసారి ఎవరు సెట్ అవుతారా అని ఆచి తూచి ఎదురుచూస్తున్నాడు. 

ఈ ఎదురు చూడడం లో పుణ్యకాలం గడిచిపోతోంది. ఎలాగైనా ఆగస్టులో ఒకటి అక్టోబర్ లేదా నవంబర్ లో మరొకటి సెట్ మీదకు తీసుకు వెళ్లాలన్నది ఆలోచన. కానీ కదురుతుందా లేదా అన్నదే చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?