ఏలియన్స్…నిలువునా ముంచిందా?

తెలంగాణ విభజనకు ముందు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉవ్వెత్తున ఎగిసింది. లెక్కకు మిక్కిలిగా ప్రాజెక్టులే ప్రాజెక్టలు. ఇప్పడు అదంతా గతం.. ఇప్పుడు జంటనగరాల్లో ఫ్లాట్ లయితే లక్ష మేరకు ఖాళీగా పడి వున్నాయి. కొనుగోలు…

తెలంగాణ విభజనకు ముందు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉవ్వెత్తున ఎగిసింది. లెక్కకు మిక్కిలిగా ప్రాజెక్టులే ప్రాజెక్టలు. ఇప్పడు అదంతా గతం.. ఇప్పుడు జంటనగరాల్లో ఫ్లాట్ లయితే లక్ష మేరకు ఖాళీగా పడి వున్నాయి. కొనుగోలు దారుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి అనేకానేక ప్రాజెక్టుల్లో ఏలియన్స్ టౌన్ షిప్ ఒకటి. 

అంతర్జాతీయ స్థాయిలో, ఆధునిక సాంకేతిక సొబగులతో రూపొందిస్తామని తెగ ఊదరగొట్టారు. రెండు మూడేళ్ల క్రితం కేవలం ప్రచారానికే కోట్లు ఖర్చుచేసారు. తెల్లవారి లేస్తే, ప్రతి ఆంగ్ల పత్రికలో పేజీలకు పేజీల ప్రకటనలు కుప్పించారు. కొంతవరకు నిర్మాణాలు సాగించారు. భారీ ప్రాజెక్టు కావడంతో అమ్మకాలు లేక, ఇప్పుడు చతికిల పడ్డారు. 

దీంతో సుమారు యాభై మందికి పైగా కొనుగోలు దారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇప్పడు ప్రాజెక్టు పెద్దలు అరెస్టయ్యారు. సరే ఇదేం పెద్ద విషయం కాదు. బెయిల్ తెచ్చుకుంటారు..బయటకు వస్తారు. కానీ కొనుగొలు దారులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది. ఏళ్లు పట్టాల్సిందే. భారీ ప్రకటనలు చూసి, జనం ముందుకు వచ్చి మునిగిపోయారు.