రేవంత్ రెడ్డి …ది తేదేపా హీరో?

రేవంత్‌రెడ్డి విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది..? ఆయనను వీలయినంత ఎక్కువ కాలం సభకు బయటే వుంచాలని కేసిఆర్ అనుకుంటున్నారా?  టీఆర్ఎస్‌ నేతలు కూడా రేవంత్‌ను బహిష్కరించాలనే డిమాండ్‌ వెనక వ్యూహం ఇదేనా..?  Advertisement అసలు…

రేవంత్‌రెడ్డి విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది..? ఆయనను వీలయినంత ఎక్కువ కాలం సభకు బయటే వుంచాలని కేసిఆర్ అనుకుంటున్నారా?  టీఆర్ఎస్‌ నేతలు కూడా రేవంత్‌ను బహిష్కరించాలనే డిమాండ్‌ వెనక వ్యూహం ఇదేనా..? 

అసలు రేవంత్ రెడ్డితో లింక్ అయిన వ్యవహారాలు శుక్రవారం ఏ విధంగా అల్లుకున్నాయో ఓ సారి చూద్దాం.

రేవంత్‌రెడ్డి క్షమాపణ డిమాండ్‌ మరోసారి తెలంగాణ అసెంబ్లీని కుదిపేసింది.. అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తున్న రేవంత్‌ సభకు క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌.. మహారాష్ట్ర అసెంబ్లీ అంశాన్నీ ప్రస్తావించారు.. గవర్నర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసి ఫడ్నవిస్‌ సర్కార్‌ చట్టసభల గౌరవాన్ని పెంచిందన్నారు..

మంత్రి జగదీశ్‌రెడ్డి సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు.. రేవంత్‌ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు.. విద్యుత్‌ లెక్కలు స్పీకర్‌ టేబుల్‌ ముందు ఉంచాలని డిమాండ్‌ చేశారు.. తన నుంచి సీఎం కేసీఆర్‌ను కాపాడేందుకు ఇంతమంది అవసరమా అంటూ రేవంత్‌ ఎదురుదాడికి ప్రయత్నించారు. 

దీనికి మంత్రి హరీష్‌ కౌంటర్‌ ఇచ్చారు.. సభకు క్షమాపణ చెప్పకపోతే టీడీపీకి సంబంధించిన అంశాలు మరొకరితో మాట్లాడించాలన్నారు.. మంత్రుల తీరుపై టీటీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సభలో గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా పడింది.. తర్వాత మీడియా పాయింట్‌లోనూ రేవంత్‌ అంశాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రస్తావించారు.. రేవంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు..సభలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు టీటీడీపీ, కాంగ్రెస్‌ నేతలు.. ప్రశ్నిస్తే ఆపరేషన్‌ బ్లూస్టార్‌ చేస్తామనడం దారుణమన్నారు.. ప్రజాస్వామ్య బద్ధంగా చేసే ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు కాంగ్రెస్‌ నేతలు.. 

మొత్తానికి ఆ విధంగా రేవంత్‌ వ్యవహారం అసెంబ్లీలో దుమారం లేపింది. ఇది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచీ జరుగుతున్న వ్యవహారం… నిజామాబాద్‌ ఎంపీ కవిత రెండు చోట్ల కుటుంబసర్వేలో పేరు నమోదు చేయించుకున్నారనే ఆరోపణలతో మొదలైన గొడవ టీడీపీ ఎమ్మెల్యేల ఆరు రోజుల సస్పెన్షన్‌కు దారితీసింది.. తాజాగా విద్యుత్‌ కేటాయింపుల లెక్కలు మరోసారి రేవంత్‌ మెడకు చుట్టుకున్నాయి.. ఈతీరును చూస్తే రేవంత్ రెడ్డిని కేసిఆర్ టార్గెట్ చేసుకున్నారన్నది అర్థమవుతోంది. 

పైగా వారు మాట్లాడినంతా మాట్లాడి రేవంత్ లేచే సరికి గొడవ చేసి మాట్లాడకుండా చేస్తున్నారు.అంటే రేవంత్ సభలోకి వచ్చినా మాట్లాడనీయ కూడదని డిసైడ్ అయ్యారన్నమాట. 

అయితే ఈ వ్యవహారం అంతా రేవంత్ కే కలిసి వస్తోంది. ఇప్పుడు తెలుగుదేశంలో ఆయనే హీరో.  కొన్నాళ్ల క్రితం బాబు ఆయనను పక్కన పెడదామనుకున్నారు. కానీ ఇప్పుడు తప్పని సరిగా రేవంత్ నే ముందుకు నడిపించకతప్పదు.