టాప్ హీరోయిన్.. ఆ హీరో తో ప్రేమలో పడిందా ..?!

ఆమె మొన్నటి వరకూ ఒక హీరో ప్రేమలో ఉండేది. ఇద్దరూ కలిసి అనేక చోట్ల కనిపించారు. శ్రీకాళహస్తికి కూడా  జంటగా వెళ్లి పూజలు చేయించుకొని వచ్చారు. అయితే ఏమైందో కానీ.. వారిద్దరి బంధానికీ బ్రేక్…

ఆమె మొన్నటి వరకూ ఒక హీరో ప్రేమలో ఉండేది. ఇద్దరూ కలిసి అనేక చోట్ల కనిపించారు. శ్రీకాళహస్తికి కూడా  జంటగా వెళ్లి పూజలు చేయించుకొని వచ్చారు. అయితే ఏమైందో కానీ.. వారిద్దరి బంధానికీ బ్రేక్ వచ్చింది. ఎవరికి వారు అయ్యారు. ఆ హీరో ఇప్పడు అంత ఫామ్ లో కూడా లేడు. ఈ హీరోయిన్ మాత్రం తెలుగు, తమిళ భాషల్లో యమ బిజీగా బిజీగా కనిపిస్తోంది. చేతినిండా సినిమాలున్నాయి. మరి ఇంత బిజీగా కనిపిస్తున్న ఆమె ఇప్పుడు మరో హీరో ప్రేమలో సేదతీరుతోందని తెలుస్తోంది!

ఆ హీరోతో కలిసి ఇప్పటికే నటించింది ఆమె. మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో కావడంతో అతడికి హిట్స్ తో సంబంధం లేకుండా చేతిలో సినిమాలున్నాయి. ఆ హీరోపై ఈ హీరోయిన్ కు మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది! తాజాగా ఆ హీరోయిన్… తనకు ఇష్టమైన వాటి గురించి చెబుతూ… ఆ హీరో పేరు స్టార్ట్ అయ్యే అక్షరంపై అమితంగా ప్రేమను వ్యక్త పరిచింది. ఆ అక్షరమంటే తనకు ప్రాణమని చెప్పుకొచ్చింది! ఈ విధంగా అతడిపై  ఆమె ప్రేమను పరోక్షంగా కమ్ బహిరంగంగా వ్యక్తపరిచిందనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి.

ఆ అక్షరంపై ఎందుకంత ప్రేమ అంటే మాత్రం “నో కామెంట్'' అంటూ తప్పించుకొంటోంది కానీ.. ఆ ప్రేమ అలా దాచేస్తే దాగదనే అభిప్రాయాలు వినిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే వీరి డేటింగ్ రహస్యంగానే సాగుతోంది. అది వెలుగుచూడడం మాత్రం కష్టమేనేమో!