ఎన్టీఆర్ సినిమాకు కాస్ట్ కంట్రోల్

దర్శకుడు పూరి జగన్నాధ్ మేకింగ్ స్టయిల్ చిత్రంగా వుంటుంది. నిర్మాత స్టామినా ను బట్టి సినిమా చేసే డైరక్టర్ పూరి. ఇప్పుడు ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమాకు చాలా జాగ్రత్తగా ఖర్చు చేయిస్తున్నాడట. నిర్మాత…

దర్శకుడు పూరి జగన్నాధ్ మేకింగ్ స్టయిల్ చిత్రంగా వుంటుంది. నిర్మాత స్టామినా ను బట్టి సినిమా చేసే డైరక్టర్ పూరి. ఇప్పుడు ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమాకు చాలా జాగ్రత్తగా ఖర్చు చేయిస్తున్నాడట. నిర్మాత బండ్ల గణేష్ కాస్త కష్టాల్లో వున్నాడు. బాద్ షా, ఇదరమ్మాయిలతో సినిమాలు తెచ్చి పెట్టింది ఏమీలేదు. గోవిందుడు అలా అలా గట్టెక్కాడు. 

అందుకే ఈ సినిమాకు బడ్జెట్ తదితర వ్యవహారాలన్నీ పూరికి వదిలేసాడట. దాంతో పూరి చాలా జాగ్రత్తగా, వీలయినంత పొదుపుగా నిర్మాణం సాగిస్తున్నాడట. ఎంత బడ్జెట్ లో వెళ్తున్నారంటే, సినిమాకు సంబంధించిన మూడు పాటలను ఒక్క గోవాలోనే షూట్ చేసేసినట్లు తెలుస్తోంది. ఇంకో సెట్ పాట, మాంటేజ్ సాంగ్ వున్నాయట. వాటిని కూడా వీలయినంత తక్కువలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

ఇదిలా వుంటే సినిమాను ఎలాగైనా సంక్రాంతికి తీసుకురావాలని, కిందా మీదా పడి, చిన్న చిన్న అడ్జెస్ట్ మెంట్ లు చేసుకుని షూటింగ్ కానిచ్చేస్తున్నారట.

ఇదిలా వుంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ చాలా బాగుందన్న టాక్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ కాప్ గా నటిస్తుండడంతో తక్కువ హెయిర్ తో మాంచి లుక్ తో కనిపించనున్నాడట.