తానా సభల్లో స్పిరిట్వుఅల్ ఫౌండేషన్ వారి పుస్తక ప్రదర్సన!

జూలై 2 నుండి 4 వరకు మిచిగాన్ రాష్త్రం లోని మిచిగన్ పట్టణం కోబో సెంటర్లో జరిగే తానా మహా సభల్లో ప్రముఖ రచయిత, సీనియర్ పత్రిక సంపాదకులు,  యోగ సాధకులు శ్రీ శార్వరి…

జూలై 2 నుండి 4 వరకు మిచిగాన్ రాష్త్రం లోని మిచిగన్ పట్టణం కోబో సెంటర్లో జరిగే తానా మహా సభల్లో ప్రముఖ రచయిత, సీనియర్ పత్రిక సంపాదకులు,  యోగ సాధకులు శ్రీ శార్వరి వందకు పైగా రచించిన యోగ సాహిత్యం పుస్తక ప్రదర్సన ఏర్పాటు చేస్తునట్లు స్పిరిట్వుఅల్ ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపకులు డాక్టర్ రమణ వాసిలి ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ పుస్తకాలతో పాటు  వాసిలి వసంత కుమార్ వ్యక్తిత్వ వికాసనకు దోహదపడే అత్యంత ప్రముఖ రచనలు, గెలవాలి గెలిపించాలి, సిగ్గుపడితే సక్సస్ రాదు, పెళ్లి మైనస్ పెటాకులు వంటి పుస్తకాలు ఎటువంటి లాభం లేకుండా కేవలం అమెరికాలో ఉండే తెలుగు వారికీ మంచి పుస్తకాలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ రమణ చెప్పారు. 

సికింద్రాబాద్ లోని మాస్టర్ యోగాశ్రం, మాస్టర్ యోగాలయ మరియు మాస్టర్ బుక్ వరల్డ్ ప్రచురించిన అన్ని యోగ, ధ్యాన, ఆధ్యాత్మిక పుస్తకాలు తానా మహా సభల్లో దొరుకుతాయని డాక్టర్ రమణ వాసిలి తెలిపారు.