వాళ్ళిద్దరూ ఇల్లు కొనుక్కున్నారట

బాలీవుడ్‌ భామ కత్రినాకైఫ్‌, తన జీవిత భాగస్వామిని ఖరారు చేసుకుందంటూ చాలాకాలంగా బాలీవుడ్‌ మీడియాలో గుసగుసలు విన్పిస్తున్నాయి. బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణ్‌బీర్‌కపూర్‌తో కత్రినా ఎఫైర్‌ నడుపుతోందన్న వార్తలు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా…

బాలీవుడ్‌ భామ కత్రినాకైఫ్‌, తన జీవిత భాగస్వామిని ఖరారు చేసుకుందంటూ చాలాకాలంగా బాలీవుడ్‌ మీడియాలో గుసగుసలు విన్పిస్తున్నాయి. బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణ్‌బీర్‌కపూర్‌తో కత్రినా ఎఫైర్‌ నడుపుతోందన్న వార్తలు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా విన్పిస్తుండగా, తాజాగా వీరిద్దరూ ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్‌ కొనుక్కున్నారన్న వార్త బాలీవుడ్‌ వర్గాల్ని షాక్‌కి గురిచేసింది.

త్వరలో పెళ్ళి పీటలెక్కనున్న కత్రినా – రణ్‌బీర్‌, పెళ్ళయ్యాక కలిసి జీవించేందుకోసం విలాసవంతమైన ఫ్లాట్‌ కోసం నాలుగైదు నెలలుగా సుదీర్ఘమైన అన్వేషణ జరిపారట. ఆ అన్వేషణ ఫలించి, ముంబైలోని కార్టర్‌ రోడ్‌లో వారికి ఓ అద్భుతమైన ఫ్లాట్‌ దొరికిందట. ఇంకేముంది.. త్వరలో గృహప్రవేశం చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసుకునే పనిలో బిజీగా వుందట ఈ బాలీవుడ్‌ జంట.

అసలు పెళ్ళెప్పుడు.? అన్నదానిపై స్పష్టత లేదు. ఆ మాటకొస్తే, ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు కత్రినాగానీ, రణ్‌బీర్‌గానీ ఇప్పటివరకూ ప్రకటించలేదు. ఈలోగా ఇద్దరూ కలిసి జీవించడానికి ఫ్లాట్‌ కొనుక్కున్నారన్న వార్తల్లో నిజం వుందంటారా.? బాలీవుడ్‌ మీడియా మాత్రం, రణ్‌బీర్‌ ` కత్రినా కొద్ది నెలల్లోనే పెళ్ళి పీటలెక్కబోతున్నారంటోంది.