బాలీవుడ్ భామ కత్రినాకైఫ్, తన జీవిత భాగస్వామిని ఖరారు చేసుకుందంటూ చాలాకాలంగా బాలీవుడ్ మీడియాలో గుసగుసలు విన్పిస్తున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్‌కపూర్‌తో కత్రినా ఎఫైర్ నడుపుతోందన్న వార్తలు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా విన్పిస్తుండగా, తాజాగా వీరిద్దరూ ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుక్కున్నారన్న వార్త బాలీవుడ్ వర్గాల్ని షాక్‌కి గురిచేసింది.
త్వరలో పెళ్ళి పీటలెక్కనున్న కత్రినా – రణ్‌బీర్, పెళ్ళయ్యాక కలిసి జీవించేందుకోసం విలాసవంతమైన ఫ్లాట్ కోసం నాలుగైదు నెలలుగా సుదీర్ఘమైన అన్వేషణ జరిపారట. ఆ అన్వేషణ ఫలించి, ముంబైలోని కార్టర్ రోడ్లో వారికి ఓ అద్భుతమైన ఫ్లాట్ దొరికిందట. ఇంకేముంది.. త్వరలో గృహప్రవేశం చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకునే పనిలో బిజీగా వుందట ఈ బాలీవుడ్ జంట.
అసలు పెళ్ళెప్పుడు.? అన్నదానిపై స్పష్టత లేదు. ఆ మాటకొస్తే, ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు కత్రినాగానీ, రణ్బీర్గానీ ఇప్పటివరకూ ప్రకటించలేదు. ఈలోగా ఇద్దరూ కలిసి జీవించడానికి ఫ్లాట్ కొనుక్కున్నారన్న వార్తల్లో నిజం వుందంటారా.? బాలీవుడ్ మీడియా మాత్రం, రణ్‌బీర్ ` కత్రినా కొద్ది నెలల్లోనే పెళ్ళి పీటలెక్కబోతున్నారంటోంది.