అమెరికా మెంఫిస్ పట్టణంలో ఇండియా కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ (ఐ సి సి టి)గా పేరొందిన శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మాణంలో, అభివృద్దిలో విశేష కృషి చేసిన డాక్టర్ ప్రసాద్ దుగ్గిరాలను మే నెల 2న ఐ సి సి టి సంస్కృతిక కేంద్రంలో ఆధ్యాత్మక సంస్థ స్పిరిటువల్ ఫౌండేషన్ (SPIRITUAL FOUNDATION) వారు 2015 సంవత్సరానికి గాను జీవన సాఫల్య పురస్కారం ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభ దుగ్గిరాల దంపతుల్ని దుస్సాలువతో, సన్మానపత్రంతో, బంగారు కంకనంతో సన్మనించరు. హవాయి హిందూ ఆలయం నిర్వాహకులు సద్గురు శ్రీ భోదినాథ వేలన్ స్వామి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. డాక్టర్ ప్రసాద్ మరియు డాక్టర్ విజయలక్ష్మి దుగ్గిరాల దంపతులు మిల్లియన్ల డాలర్లని ఆలయ అభివృద్ధికి వెచ్చించారు.
అనేక ఫండ్ రైసింగ్ ఈవెంట్స్ ద్వార మరెన్నో మిల్లియన్ల డాలర్లని డాక్టర్ విజయలక్ష్మి సమకూర్చారు. ఈ సందర్భంగా దంపతుల ధర్మికతని వివరిస్తూ స్నేహితులు, సహా ఉద్యోగులు, బందువులు, భక్తులు రాసిన ప్రత్యేక పుస్తకం “లివింగ్ ఫర్ జనరేషన్స” ప్రత్యేక సంచికని దుగ్గిరాల దంపతుల మనవడు రవి తేజస్ ఆవిష్కరించాడు. ఏప్రిల్ 29 నుండి మే 3 వరకు ఐ సి సి టి లో జరుగుతున్న సతరుద్ర్రేయ యజ్ఞం లో భాగంగా ఈ పురస్కార కార్యక్రమం నిర్వహించారు.
దాదాపు ఐదువందల పైచిలుకు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వెంకట సత్యనారాయణ ఆచార్యులు, శ్రీ వెంకట కృష్ణ సాయి ఉత్తర అమెరికా మరియు భారత దేశం నుండి యజ్ఞం నిర్వహించడానికి వచ్చిన మరో వంద మంది అర్చకులు, ఆగమ పండితులు సన్నాయి మరియు డోలు మంగళవాయిద్యాల సుస్వరాలతో ప్రత్యేకంగా ఆసీర్వదించరు.