ఇంటర్నెట్‌ ఆగితే.. ప్రపంచం స్తంభించినట్టే.!

తుమ్మితే ఇంటర్నెట్‌.. దగ్గితే ఇంటర్నెట్‌.. బాత్రూంలో, బెడ్రూమ్‌లో.. ఇలా ఎక్కడన్నా ఇంటర్నెట్‌ వుండి తీరాల్సిందే. అది స్మార్ట్‌ ఫోన్‌ కోసం అయినా, పర్సనల్‌ కంప్యూటర్‌లో అయినా.. ఇంటర్నెట్‌ లేకపోతే ఇంకేమన్నా వుందా.? ప్రపంచం స్తంభించిపోతుంది.…

తుమ్మితే ఇంటర్నెట్‌.. దగ్గితే ఇంటర్నెట్‌.. బాత్రూంలో, బెడ్రూమ్‌లో.. ఇలా ఎక్కడన్నా ఇంటర్నెట్‌ వుండి తీరాల్సిందే. అది స్మార్ట్‌ ఫోన్‌ కోసం అయినా, పర్సనల్‌ కంప్యూటర్‌లో అయినా.. ఇంటర్నెట్‌ లేకపోతే ఇంకేమన్నా వుందా.? ప్రపంచం స్తంభించిపోతుంది.

కానీ, భవిష్యత్తులో ఇంటర్నెట్‌కి తీవ్ర సంక్షోభం పొంచి వుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వినియోగం పెరిగిపోతుండడంతో ఇప్పుడున్న ఆప్టికల్‌ ఫైబర్‌ టెక్నాలజీ ‘వినియోగ ఒత్తిడి’ని తట్టుకోలేకపోతోందన్నది నిపుణుల వాదన. ఇప్పటికిప్పుడు తేరుకోకపోతే, ఇంటర్నెట్‌ భవిష్యత్తులో స్తంభించిపోయే ప్రమాదం వుందనే నిపుణుల హెచ్చరికతో ఒక్కసారిగా ఇంటర్నెట్‌ వినియోగదారులు షాక్‌కి గురయ్యారు.

‘ఆ.. 2000 సంవత్సరంలో ప్రపంచం అంతమైపోతుందన్నారు.. అయ్యిందా.?’ అని కొందరు దీర్ఘాలు తీస్తోంటే, ‘2012’ సినిమ ఎంత నిజమో, ఇది కూడా అంతేననీ, పట్టించుకోవాల్సిన అవసరమే లేదని మరికొందరు లైట్‌ తీసుకుంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం. ఇంటర్నెట్‌ సర్వర్లపై ఒత్తిడి రోజురోజుకీ పెరిగిపోతోంది.
 
ఇంటర్నెట్‌ వినియోగదారులు వాడకాన్ని తగ్గించే అవకాశం లేనే లేదు. దాంతో, వున్నపళంగా టెక్నాలజీ అభివృద్ధి చెందని పక్షంలో, నిపుణులు హెచ్చరిస్తున్నట్లే సమీప భవ్యిత్తులో ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఎంతోకొంత ఆందోళన చెందాల్సిందే. అదే సమయంలో టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ అవ్వాల్సిన అవసరం ఎంతైనా వుంది.