శుభం పలకరా అన్నట్లు అనిపిస్తుంది కానీ, లైన్ విన్నాక అలా అనక తప్పడం లేదు. గోపీచంద్ మలినేని బలుపు తరువాత మొత్తానికి మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. రామ్ హీరో. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు వెలిగొండ శ్రీనివాస్ కథకు, కోన వెంకట్ స్రీన్ ప్లే మాటలు అందిస్తే, అనిల్ రావిపూడి సహకారం అందించారు.
ఇంతకీ ఈ సినిమా ప్రారంభ మీడియా సమావేశంలో రచయిత లైన్ చెప్పగానే అత్తారింటికి దారేది గుర్తుకు వచ్చింది జనాలకు. ఇంతకీ చెప్పిన లైన్ ఏమిటంటే, రచయిత మాటల్లోనే…'ఈ రోజుల్లో డబ్బు సంపాదన కోసం తమ వారి అందరినీ వదిలి జనం విదేశాలకు వెళ్తుంటే, ఓ మిలియనీర్ తన వాళ్ల కోసం విదేశాల నుంచి వచ్చి ఏం చేసాడన్నది' ఇలా చెప్పగానే ఎవరికైనా అత్తారింటికి దారేది గుర్తుకు రావడం సహజమే. ఆఫ్ కోర్స్..వారి కథ వేరే వుండి వుండొచ్చు. అది వేరేసంగతి.