మహేష్ ఫుల్లీ ఇన్వాల్డ్

వన్ సినిమా హీరో మహేష్ బాబుపై ఓ రేంజ్ లో ప్రభావం చూపించినట్లుంది. దాంతో ఆగడు సినిమాపై ఇలా, అలా అని కాదు, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వినికిడి. తరచు రష్ చూస్తూ, తగిన…

వన్ సినిమా హీరో మహేష్ బాబుపై ఓ రేంజ్ లో ప్రభావం చూపించినట్లుంది. దాంతో ఆగడు సినిమాపై ఇలా, అలా అని కాదు, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వినికిడి. తరచు రష్ చూస్తూ, తగిన మార్పలు, చేర్పులు చెబుతున్నాడట. నిజానికి గతంలో మహేష్ కు డైరక్టర్ల ఏక్టర్ అని పేరుండేది. 

ఒకసారి కమిటైతే తను ఇన్వాల్వ్ కావడం అన్నది వుండేది కాదు. శ్రీను వైట్లకు కూడా ఇది అనుభవమే దూకుడు సినిమాతో. కానీ ఇప్పుడు కొత్త మహేష్ ను చూస్తున్నాం అంటున్నారు యూనిట్ సభ్యులు. పోనీ హీరో అన్నాక, దర్శకుడిని మరీ గుడ్డిగా నమ్మేయడం కూడా పనికిరాదు. కానీ మరీ అతిగా ఇన్వాల్వ్ కావడం కూడా మంచిది కాదేమో? మహేష్ ఆలోచించాలి.