వెంకటేష్ ఇంటర్వ్యు (ఎక్స్ క్లూజివ్ )

సర్ మసాలా సినిమా ఎలా ఉంటుంది?  Advertisement య …మసాలా మూవీ ఓ వెరైటీ సబ్జెక్ట్. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కు కొంత టైం పట్టినా మేబి కరెక్ట్ టైం…

సర్ మసాలా సినిమా ఎలా ఉంటుంది? 

య …మసాలా మూవీ ఓ వెరైటీ సబ్జెక్ట్. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కు కొంత టైం పట్టినా మేబి కరెక్ట్ టైం కె రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చెయ్యలేదు. అండ్ రామ్ కు కూడా ఇది ఓ డిఫరెంట్ క్యారెక్టర్. రామ్ కూడా చాలా బాగా చేశాడు. ఫ్యామిలి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. 

అజయ్ దేవగన్ కంటే బాగా చేశారని అంటున్నారు? 

జనం అలా అంటే చాలా హ్యాపి. హిందీ లో సక్సెస్ అయిన సినిమాను తీసుకుని చేశాం. చాలా బాగా వచ్చింది. ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాం. నువ్వు నాకు నచ్చావ్ తరువాత అలాంటి ఫ్యామిలి సినిమా ఇది. అందరికి బాగా నచ్చుతుంది. 

సచిన్ లాస్ట్ మ్యాచ్ చూడ్డానికి వెళ్తున్నారా? 

యా …వెళ్తున్న నిజానికి సచిన్ క్రికెట్ కు దూరం అవడం కాస్త బాధగానే ఉంది కాని ఇంత లాంగ్ స్పాన్ కెరీర్ ఉన్న క్రికెటర్ సచినే కదా. సో మ్యాచ్ చూసి బాగా ఎంజాయ్ చెయ్యాలి. వెరీ గుడ్ మ్యాచ్ ఐ వాంట్ తో సి. 

మల్టి స్టారర్ సినిమాలంటే వెంకటేష్ రెడీ గా ఉన్నారు? ఎందుకు ?

మల్టి స్టారర్ చెయ్యడానికి నేను ఎప్పటి నుంచో రెడీ గా ఉన్నాను. మంచి కథలు దొరికితే   చేస్తానని  ఎప్పుడో చెప్పాను. మల్టి స్టారర్ ఇస్ గుడ్ ఫర్ ఇండస్ట్రీ. రామ్ చరణ్ తో కలసి చేస్తున్నాను. కథ చాలా బాగుంది. కృష్ణవంశి బాగా చెక్కుతున్నాడు. 

మల్టి స్టారర్స్ చేసుకుంటూ పోతే సోలో హీరోగా ఎప్పుడు చేస్తారు ?

రాధా చేస్తున్నాను కదా. సూపర్ సబ్జెక్ట్. వెరీ నైస్ స్టొరీ.