మెగా హీరోకి పర్‌ఫెక్ట్‌ ఫౌండేషన్‌

నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌పై మెగా ఫ్యామిలీకి గట్టి నమ్మకమే ఉన్నట్టుంది. అందుకే అతడిని హీరోగా పరిచయం చేసే సినిమా గురించి ఇంతగా ఆలోచించి, ఇన్ని తర్జనభర్జనలు పడ్డారు. ఫైనల్‌గా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వరుణ్‌…

నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌పై మెగా ఫ్యామిలీకి గట్టి నమ్మకమే ఉన్నట్టుంది. అందుకే అతడిని హీరోగా పరిచయం చేసే సినిమా గురించి ఇంతగా ఆలోచించి, ఇన్ని తర్జనభర్జనలు పడ్డారు. ఫైనల్‌గా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వరుణ్‌ తొలి సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్ర కథని చిరంజీవి విని ఓకే చేశారట. పవన్‌కళ్యాణ్‌ కూడా స్టోరీ లైన్‌ విని బాగుందని చెప్పాడట. 

నాగబాబు మాత్రమే కాకుండా మిగతా ఇద్దరు మెగా బ్రదర్స్‌ కూడా వరుణ్‌ తేజ్‌ మొదటి సినిమాపై చాలా కేర్‌ తీసుకుంటున్నారని టాక్‌. చరణ్‌, అల్లు అర్జున్‌ హీరోలుగా సెటిల్‌ అయిపోయారు కాబట్టి ఇప్పుడు వరుణ్‌ తేజ్‌కి కరెక్ట్‌ ఫౌండేషన్‌ వేస్తే మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గురు యువ హీరోలు టాప్‌లో ఉంటారని వారు అనుకుంటున్నారట. 

వరుణ్‌ తేజ్‌ మొదటి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే అంశాలతో ఉంటుందట. మొదటి సినిమాతోనే అతనిపై క్లాస్‌ లేదా మాస్‌ అనే బ్రాండ్‌ పడకుండా, అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించే అంశాలున్న కథని ఎంచుకున్నారట. ఈ సినిమాకి వచ్చే స్పందనని బట్టి వరుణ్‌ తేజ్‌ తదుపరి చిత్రం ఎలా ఉండాలనేది డిసైడ్‌ చేస్తారట. ఇప్పటికే ఒక ప్రముఖ దర్శకుడితో వరుణ్‌ రెండో సినిమా కోసం సంప్రదింపులు జరుపుతున్నారట.