ఐఫోన్-8 ఇండియాలో లక్ష రూపాయలు?

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్-8 వచ్చేనెలలో మార్కెట్లోకి రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ రెండో వారం లేదా మూడో వారంలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై వినిపిస్తున్న మరో…

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్-8 వచ్చేనెలలో మార్కెట్లోకి రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ రెండో వారం లేదా మూడో వారంలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై వినిపిస్తున్న మరో రూమర్ ఏంటంటే.. అంతర్జాతీయ మార్కెట్లో వెయ్యి డాలర్ల ఖరీదైన ఈ ఫోన్, భారత్ లో లక్ష రూపాయలు ఉండొచ్చట. అదే కనుక నిజమైతే ఇండియాలో అత్యంత ఖరీదైన ఐఫోన్ గా సిరీస్-8 (టాప్ ఎండ్ మోడల్) రికార్డు సృష్టించడం ఖాయం.

ధర సంగతి పక్కనపెడితే.. ఈసారి ఐఫోన్ లో విప్లవాత్మక మార్పులొచ్చే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఫోన్ లో ఉండే ఒకేఒక్క “హోం బటన్” ను కూడా ఆపిల్ సంస్థ తొలిగించేస్తోందని.. ఆ స్థానంలో “వర్చువల్ బటన్” ను ఏర్పాటుచేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. తమ సంస్థ పదవ వార్షికోత్సవం సందర్భంగా ఇలాంటి మరికొన్ని విప్లవాత్మక మార్పుల్ని ఐఫోన్ అందుబాటులోకి తీసుకురాబోతోందట.

వర్చువల్ బటన్ తో పాటు త్రీడీ ఫేస్ ఐడీ అనే మరో అత్యాధునిక ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. తాజాగా విడుదలకు సిద్ధమైన ఐఫోన్-8లో 512 జీబీ స్టోరేజ్, 3జీబీ రామ్, వెనక వైపే 2 కెమెరాలు (గూగుల్ పిక్సెల్ తరహాలో ఒకటి ఇమేజ్ సెన్సార్ గా పనిచేస్తుంది), వోఎల్ఈడీ డిస్ ప్లే, అత్యంత వేగవంతమైన ఎ-11 ప్రాసెసర్ లాంటి ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.