కొత్తగా మరో తేదీ… అట్లుంటది టిల్లూతోటి!

ఒకటి కాదు, రెండు కాదు, మినిమం గ్యాప్స్ లో ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది టిల్లూ స్క్వేర్ సినిమా. డీజే టిల్లూ బ్లాక్ బస్టర్ హిట్టయిన తర్వాత వెంటనే దానికి సీక్వెల్ ప్రకటించారు. అలా ఏడాదిన్నర…

ఒకటి కాదు, రెండు కాదు, మినిమం గ్యాప్స్ లో ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది టిల్లూ స్క్వేర్ సినిమా. డీజే టిల్లూ బ్లాక్ బస్టర్ హిట్టయిన తర్వాత వెంటనే దానికి సీక్వెల్ ప్రకటించారు. అలా ఏడాదిన్నర కిందటే ఆర్భాటంగా మొదలైంది టిల్లూ స్క్వేర్. ఆ వెంటనే రెగ్యులర్ షూట్ కూడా స్టార్ట్ చేశారు.

2023 సమ్మర్ అనుకున్నారు. ఆ తర్వాత జూన్ అన్నారు. ఆ తర్వాత నెల తప్పించి నెల ఈ సినిమా పేరు వినిపించింది. చివరికి గతేడాది క్రిస్మస్ కు రిలీజ్ చేస్తారనే టాక్ కూడా వచ్చినప్పటికీ, ఏకంగా సినిమాను ఈ ఏడాదికి వాయిదా వేశారు.

వాలంటైన్స్ వీక్ లో ఫిబ్రవరి 9న టిల్లూ స్క్వేర్ ను రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా ప్రకటించారు. ఈ మేరకు హీరో సిద్ధు జొన్నలగడ్డ క్రాస్ ప్రమోషన్స్ కూడా ప్రారంభించాడు. అంతలోనే సినిమా మరోసారి వాయిదా పడింది.

ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ సినిమాకు తాజాగా మరో రిలీజ్ డేట్ లాక్ చేశారు. ఈసారి మార్చి 29. మాంఛి పోస్టర్ వదిలి మరీ ఆర్భాటంగా విడుదల తేదీ ప్రకటించారు.

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది కానీ రిలీజ్ డేట్ మాత్రం సెట్ అవ్వడం లేదు. కనీసం ఈసారైనా చెప్పిన తేదీకి ఈ సినిమా రావాలని కోరుకుందాం.