ఒకటి కాదు, రెండు కాదు, మినిమం గ్యాప్స్ లో ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది టిల్లూ స్క్వేర్ సినిమా. డీజే టిల్లూ బ్లాక్ బస్టర్ హిట్టయిన తర్వాత వెంటనే దానికి సీక్వెల్ ప్రకటించారు. అలా ఏడాదిన్నర కిందటే ఆర్భాటంగా మొదలైంది టిల్లూ స్క్వేర్. ఆ వెంటనే రెగ్యులర్ షూట్ కూడా స్టార్ట్ చేశారు.
2023 సమ్మర్ అనుకున్నారు. ఆ తర్వాత జూన్ అన్నారు. ఆ తర్వాత నెల తప్పించి నెల ఈ సినిమా పేరు వినిపించింది. చివరికి గతేడాది క్రిస్మస్ కు రిలీజ్ చేస్తారనే టాక్ కూడా వచ్చినప్పటికీ, ఏకంగా సినిమాను ఈ ఏడాదికి వాయిదా వేశారు.
వాలంటైన్స్ వీక్ లో ఫిబ్రవరి 9న టిల్లూ స్క్వేర్ ను రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా ప్రకటించారు. ఈ మేరకు హీరో సిద్ధు జొన్నలగడ్డ క్రాస్ ప్రమోషన్స్ కూడా ప్రారంభించాడు. అంతలోనే సినిమా మరోసారి వాయిదా పడింది.
ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ సినిమాకు తాజాగా మరో రిలీజ్ డేట్ లాక్ చేశారు. ఈసారి మార్చి 29. మాంఛి పోస్టర్ వదిలి మరీ ఆర్భాటంగా విడుదల తేదీ ప్రకటించారు.
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది కానీ రిలీజ్ డేట్ మాత్రం సెట్ అవ్వడం లేదు. కనీసం ఈసారైనా చెప్పిన తేదీకి ఈ సినిమా రావాలని కోరుకుందాం.