రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమా ఫిక్స్ అయి చాలా అంటే చాలా కాలం అయింది. ఎన్టీఆర్ చేస్తారు అనుకుని ఎదురు చూసి, చేయకపోవడంతో, అదే కథ రామ్ చరణ్ కు వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే వుంది.
పెద్ది అన్నది టైటిల్ అని కథ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లినప్పుడే వినిపించింది. అలాగే ఎఆర్ రెహమాన్, జాన్వి కపూర్ పేర్లు కూడా బయటకు వచ్చేసాయి. ఈ నెల 20న అంటే ఈ రోజు పూజ అని కూడా వచ్చింది.
అయితే గమ్మత్తుగా ఫ్యాన్స్ కు హుషారు కలిగించేందుకు అయినా పూజ లేదా ఓపెనింగ్ ఫొటొలు ఒక్కటీ బయటకు వదలలేదు. ఫొటోలు అన్నీ పక్కన పెట్టి, హీరోకి చూపించి, ఆయన ఓకె చేసిన ఒకటో రెండో సాయంత్రానికి వదులుతారని తెలుస్తోంది. ఫోటోలు ఎక్కడా షేర్ చేయవద్దని పీఆర్ టీమ్ కను మేకర్స్ కోరినట్లు తెలుస్తోంది.
కానీ గమత్తుగా బోలెడు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిపోయాయి. సినిమా విశేషాలు అన్నీ బయటకు ఎప్పుడో వచ్చేసినా ఇప్పుడు పూజ ఫొటోలు బయటకు అంత త్వరగా రాకూడదని ఎందుకు అనుకుంటున్నట్లో? బహుశా సినిమా ప్రారంభం కావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది కనుక అలా అనుకున్నారో, లేదా ది బెస్ట్ అన్న ఫొటోలు ఎంచి వదలాలని అలా పక్కన పెట్టారో?