ఘనంగా జరిగిన హీరోయిన్ పెళ్లి వేడుక

హీరోయిన్ మీరా చోప్రా వైవాహిక బంధంలోకి ఎంటరైంది. ప్రియుడు రక్షిత్ కేజ్రీవాల్ ను ఈరోజు ఆమె వివాహం చేసుకుంది. జైపూర్ లోని బ్యూనా విస్తా లగ్జరీ గార్డెన్ స్పా రిసాప్ట్ లో ఈమె పెళ్లి…

హీరోయిన్ మీరా చోప్రా వైవాహిక బంధంలోకి ఎంటరైంది. ప్రియుడు రక్షిత్ కేజ్రీవాల్ ను ఈరోజు ఆమె వివాహం చేసుకుంది. జైపూర్ లోని బ్యూనా విస్తా లగ్జరీ గార్డెన్ స్పా రిసాప్ట్ లో ఈమె పెళ్లి 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది.

పెళ్లి వేడుక ముగిసిన వెంటనే ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది మీరా చోప్రా. “ఆనందాలు, గిల్లికజ్జాలు, త్యాగాలు, నవ్వులు, కన్నీళ్లు.. ఇకపై అన్నీ నీతోనే. ప్రతి జన్మకు నువ్వే కావాలి” అంటూ పోస్ట్ పెట్టింది. పెళ్లి వేడుకలో ఎరుపు రంగు డిజైనరీ దుస్తుల్లో మెరిసింది మీరా.

2 రోజుల పాటు మీరా చోప్రా, రక్షిత్ పెళ్లి వేడుక జరిగింది. నిన్న మెహందీ ఫంక్షన్ తో సంబరం ప్రారంభమైంది. నిన్న రాత్రి సంగీత్, కాక్ టైల్ పార్టీ జరగ్గా.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు పెళ్లి జరిగింది. రాత్రికి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ పెళ్లి కోసం రిసార్ట్ మొత్తాన్ని బుక్ చేసింది ఈ జంట.

తెలుగులో బంగారం, వాన లాంటి సినిమాల్లో నటించింది మీరా చోప్రా. మూడేళ్లుగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం 2 హిందీ సినిమాలున్నప్పటికీ అవి చిన్న చిత్రాలే. మరోవైపు ఓటీటీలో రాణిస్తోంది. ఇప్పుడు పెళ్లితో వైవాహిక బంధంలోకి ప్రవేశించింది 40 ఏళ్ల మీరా చోప్రా.